Begin typing your search above and press return to search.
దీపావళి వద్దంటావా? మరి నువ్వు చేసిందేంటి పాపా?
By: Tupaki Desk | 16 Oct 2017 11:20 AM GMTసేఫ్ దివాళి.. సౌండ్ లెస్ దివాళి.. అంటూ ఇప్పుడు చాలామంది నటీనటులు క్యాంపెయిన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక విధంగా చూస్తే సౌండ్ ఎక్కవగా క్రియేట్ చేయడం అనేది మూగ జీవాలకు ఇబ్బందే కాని.. అసలు ఎంతో భక్తిశ్రద్దలతో ఆనందంగా జరుపుకునే దీపావళిని జరుపుకోవద్దు అనడం మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే ఎవరన్నా సెలబ్రిటీలు ఇలాంటి కామెంట్లు చేస్తే నెటిజన్లు అస్సలు ఊరుకోవట్లేదు.
దీపావళి జరుపుకోవడంతో అంటే టపాకాయలు కాల్చుకోవడం కాదంటూ ''సాహో'' సినిమాతో తెలుగువారిని కూడా పలకరించనున్న శ్రద్దా కపూర్ కామెంట్ చేసింది. అయితే ఆమె చేసిన ఈ కామెంట్లకు ఇప్పుడు ఆన్ లైన్ లో విపరీతమైన ట్రాలింగ్ జరుగుతోంది. ''అసలు నువ్వు మొన్న హాఫ్ గాళ్ ఫ్రెండ్ సినిమా హిట్టయ్యిందని.. హీరో అర్జున్ కపూర్ తో కలసి టపాకాయలు కాల్చుకున్నావ్. అంటే నీ ఆనందాన్ని నువ్వు అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాని.. మేం మాత్రం కాల్చుకోకూడదా?'' అంటూ కొందరు సెటైర్లు వేస్తూ.. ''మూగజీవాలకు ఇబ్బందిగా ఉంటుందని నువ్వు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు తెలియలేదా?'' అంటూ ఆమెను ట్రాల్ చేశారు.
ఈ కామెంట్లపై శ్రద్దా కపూర్ స్పందించలేదు కాని.. తమ చిన్నతనంలో బాగానే టపాకాయలు కాల్చుకుని ఎంజాయ్ చేసేసి.. ఇప్పుడు మాత్రం ఏవో కొన్ని ఎన్జీఓ సంస్థలు డబ్బులు ఇస్తుంటే.. అవి తీసుకుని సెలబ్రిటీలు ఇలా దీపావళికి టపాకాయాలు కాల్చొద్దూ అంటూ ప్రకటనలు చేస్తున్నారని జనాలు ఎద్దేవా చేస్తున్నారు.