Begin typing your search above and press return to search.
చిన్ననాటి చెలికాడిని పెళ్లాడనున్న సాహో శ్రద్ధ!?
By: Tupaki Desk | 30 Jan 2021 12:30 AM GMTఇటీవల వరుసగా స్టార్లంతా పెళ్లి బంధంతో ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. నిఖిల్- నితిన్-రానా లాక్ డౌన్ లోనే పెళ్లాడేసారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ తన చిన్న నాటి స్నేహితురాలు కం ప్రియురాలు నటాషా దలాల్ ని పెళ్లాడి శహభాష్ అనిపించాడు.ఇప్పుడు సాహో కథానాయిక శ్రద్ధా కపూర్ కూడా పెళ్లికి రెడీ అవుతోందని తన చిన్న నాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠను పెళ్లాడేయనుందని ప్రచారమవుతోంది. అయితే దీనిపై అధికారికంగా శ్రద్ధా ఏదీ చెప్పకపోవడంతోనే కన్ఫ్యూజన్ నెలకొంది.
అయితే రోహన్ చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని అతడి తండ్రి రాకేశ్ రోహన్ ఫోటోగ్రాఫర్ కాక ముందు నుంచి పరిచయం అని శ్రద్ధ తండ్రి శక్తి కపూర్ ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతడి ఫోటోషూట్లలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. చిన్నప్పటి నుంచి శ్రద్ధ- రోహన్ కలిసి పెరిగారని అతడు నిరంతరం తన ఇంటికి వస్తుంటాడని కూడా వెల్లడించారు. స్నేహితుడినే పెళ్లాడే అదృష్టం ఎందరికి ఉంటుంది? ఒకవేళ ఆ అదృష్టం శ్రద్ధాని వరిస్తే అందుకు అభిమానులకు కూడా సమ్మతమే సుమీ.