Begin typing your search above and press return to search.
ఒకప్పటి సెక్సీ హీరోయిన్ ఎలా అయ్యిందంటే..
By: Tupaki Desk | 3 April 2017 6:31 AM GMT‘దొంగ దొంగ’ సినిమా చూసిన వాళ్లెవ్వరూ కూడా అను అగర్వాల్ ను అంత సులువుగా మరిచిపోలేరు. దక్షిణాది ప్రేక్షకుల్ని ఆ ఒక్క సినిమాతోనే ఉర్రూతలూగించేసింది అను. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె పేరెత్తగానే ‘ఆషికి’ గుర్తుకొస్తుంది. ఆ సినిమాతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఈ డస్కీ బ్యూటీ ఆ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఓ మధుర జ్నాపకంగా మిగిలిపోయింది. అప్పట్లో కుర్రకారును అను ఒక ఊపు ఊపేసింది. తర్వాతి కాలంలో ఆమె ఒక రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలో దాదాపు నగ్నంగా కూడా కనిపించింది. ఐతే అప్పుడంత అందంగా ఉన్న అను అగర్వాల్.. ఇప్పుడెలా తయారైందో తెలిస్తే షాకవ్వాల్సిందే.
మహేష్ భట్ ప్రొడక్షన్ హౌజ్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో ఒక వేడుక చేశారు. ఈ 30 ఏళ్లలో ఆయన ప్రొడక్షన్లో పని చేసిన నటీనటులు.. టెక్నీషియన్లను ఈ వేడుకకు పిలిచారు. అప్పట్లో ‘ఆషికి’ సినిమాలో నటించిన హీరో రాహుల్ రాయ్ తో కలిసి అను రాగా.. దీని సీక్వెల్ ‘ఆషికి-2’లో జంటగా కనిపించిన సిద్దార్థ్ రాయ్ కపూర్-శ్రద్ధా కపూర్ కూడా ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఐతే వీరందరిలో చాలా చిత్రంగా.. గుర్తుపట్టలేనట్లుగా కనిపించింది అనునే. హీరోయిన్ గా కెరీర్ ముగిశాక అనుకు ఒక పెద్ద యాక్సిడెంట్ కావడం వల్లే ఆమె ఇలా తయారైంది. ఆ యాక్సిడెంట్ వల్ల దాదాపు నెల రోజులు ఆమె కోమాలోకి వెళ్లింది. బాడీ బాగా డ్యామేజ్ అయింది. నెలల తరబడి చికిత్స చేయించుకున్నాక కానీ ఆమె కోలుకోలేదు. ఒంటికి ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు కూడా జరిగాయి. అయినప్పటికీ అను అందాన్ని తిరిగి తీసుకురాలేకపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/