Begin typing your search above and press return to search.
సాహో జంట దొరికిపోయిందిగా
By: Tupaki Desk | 27 April 2019 5:32 AM GMTబాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో ఆగస్ట్ 15 విడుదలను టార్గెట్ గా చేసుకుని షూటింగ్ వేగవంతం చేసింది. ఎప్పుడు పూర్తవుతుంది అనే దాని గురించి యూనిట్ నుంచి అధికారిక సమాచారం లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం వచ్చే నెలతో అయిపోతుందనే నమ్మకంతో ఉన్నారు. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి టీం కూడా ఇక ప్రమోషన్ మొదలుపెట్టాలి. నూటా యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో మల్టీ లాంగ్వేజ్ లో రూపొందుతున్న సాహోకు పబ్లిసిటీ మాములుగా చేస్తే సరిపోదు. ఇదిలా ఉండగా సాహో యూనిట్ ప్రస్తుతం ముంబైలో కర్జత్ స్టూడియోస్ లో కీలక సన్నివేశాల షూటింగ్ లో ఉంది. ఇందులో శ్రద్ధా కపూర్ తో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటోంది. ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పోస్ట్ ఇంటర్వెల్ లో వచ్చే కొన్ని సీన్స్ తీస్తున్నారని తెలిసింది
అక్కడికి బిజెపి మంత్రి నితిన్ గడ్కరి రావడాన్ని పురస్కరించుకుని ప్రభాస్ శ్రద్ధాలు ఆయనతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. నిజానికి ఇప్పటి దాకా సాహో జంట ఆన్ ది సెట్స్ కలిసున్న ఫోటో ఒక్కటీ బయటికి రాలేదు. ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్యూమ్స్ తో ఇద్దరు ఉన్న పిక్ బయటికి రావడంతో ఫ్యాన్స్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో ఆల్మోస్ట్ సాహో షూటింగ్ అయిపోవచ్చని ఇన్ సైడ్ టాక్. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న కారణంగా వాటికి సంబంధించిన పనులు కూడా ఇంకో యూనిట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చెప్పిన డేట్ ప్రకారం ఆగస్ట్ 15న ఖచ్చితంగా సాహో వచ్చేది లేనిది యూనిట్ మరోసారి అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది