Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: సిల్వర్ స్క్రీన్ సైనా నెహ్వాల్
By: Tupaki Desk | 29 Sep 2018 5:53 AM GMTఇది బయోపిక్ ల కాలం. ఆ ట్రెండ్ లో స్పోర్ట్స్ పర్సన్స్ జీవిత కథలు మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే కోవలో తెరకెక్కుతున్న చిత్రం సైనా నెహ్వాల్ బయోపిక్. బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన సైనా నెహ్వాల్ బయోపిక్ అమోల్ గుప్తే దర్శకత్వంలో తెరకెక్కుతుండగా టీ-సీరీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 22 న ప్రారంభం అయింది.
రీసెంట్ గా ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ ఫస్ట్ లుక్ ను నిర్మాతలు విడుదల చేశారు. బాడ్మింటన్ రాకెట్ చేతిలో ఉన్న శ్రద్ధ మ్యాచ్ పాయింట్ గెలిచినప్పుడు విజయోత్సాహంతో పిడికిలి బిగించి ఒక ఎక్స్ ప్రెషన్ ఇస్తారు కదా.. అలానే ఎక్స్ ప్రెషనే ఇచ్చింది. ఇక స్పోర్ట్స్ జెర్సీ.. హెయిర్ బ్యాండ్.. మేకప్ లేకుండా పూర్తిగా సైనాలా గా మారింది. కరెక్ట్ గా చూస్తే శ్రద్ధ.. సైనాలలో డిఫరెన్స్ కనుక్కోవడం కష్టం అన్నంతగా మరిపోయింది.
ఇక ఈ సినిమా కోసం 40 బాడ్మింటన్ క్లాసెస్ లో పాల్గొందట. అందులో పొద్దున్నే ఆరుగంటలకు పాల్గొనే సెషన్స్ కూడా ఉన్నాయట. ఆ ప్రాక్టిస్ సెషన్స్ కష్టం అయినా ఎంజాయ్ చేశానని చెబుతోంది. ఒక స్పోర్ట్స్ పెర్సన్ పాత్ర పోషించడం ఎంతో ఛాలెంజ్ తో కూడుకున్నదని అందులో సైనా ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ అని తెలిపింది. గాయాలవల్ల ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా హార్డ్ వర్క్ తో తను అనుకున్న గోల్స్ సాధించిందని చెప్పింది.
ఇప్పటివరకూ వరల్డ్ నెంబర్ 1 రాంక్ (2015 లో) సాధించిన ఇండియన్ ఫిమేల్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మాత్రమే. కామన్ వెల్త్ గేమ్స్ లో సింగల్స్ లో రెండు బంగారు పతకాలను కూడా సాధించింది.