Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: వయ్యారాల వర్షం భలే ఉందే

By:  Tupaki Desk   |   3 April 2016 9:30 AM GMT
ఫోటో స్టోరీ: వయ్యారాల వర్షం భలే ఉందే
X
టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ వర్షంకు రీమేక్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మూవీ బాఘీ. వర్షంను ఫుల్లుగా మేకోవర్ చేసి, మార్చేసి ఓ యాక్షన్ మూవీ రేంజ్ లో చేసేశారు. వర్షం రీమేక్ కి ట్రైలర్ అని చూసిన టాలీవుడ్ ప్రేక్షకులకి.. హీరోయిన్ శ్రద్ధా కపూర్ చేసిన ఫైటింగులతో మైండ్ బ్లాంక్ అయిపోయింది. మార్షల్ ఆర్ట్స్ కూడా అలవోకగా చేసేయడంతో.. ఈ భామ ట్యాలెంట్ ఏంటో బాగానే తెలిసొచ్చింది.

అయితే.. శ్రద్ధాకపూర్ అందాలకు అడ్రస్ గా మారేందుకు ఈ మధ్య తెగ ట్రై చేసేస్తోంది. ఒకవైపు యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తూనే మరోవైపు.. బికినీ టైపు డ్రస్ వేసి అందాలు ఆరేసేయడంతో పాటు లిప్ లాక్స్ కూడా ట్రై చేసింది. గతంలో పెర్ఫామెన్స్ కు పరిమితమయ్యి.. ఇలా మారిపోవడం శ్రద్ధా కపూర్ ఉద్దేశ్యం ఏంటో ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే.. వారికో క్లారిటీ ఇచ్చేసిందిపుడు.

లాక్మీ ఫ్యాషన్ వీక్ 2016లో శ్రద్ధా కపూర్ ర్యాంప్ వాక్ అదిరిపోయింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో అమ్మడు వేసి డ్రస్సు సెగలు పుట్టించిందంతే. ఫుల్ టైట్ డ్రస్ లో ఈ భామ తన అందాలను జిప్ తో లాక్ చేసింది. ఇక ట్రాన్స్ పరెంట్ వైట్ పై ఫ్లవర్ డిజైన్ తో ఉన్న బాటమ్ కూడా అదిరింది. మొత్తానికి శ్రద్ధా కపూర్ గ్లామర్ షోపై ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నిటిపైనా ఇప్పుడు అందరికీ ఓ స్పష్టత వచ్చేసినట్లే చెప్పుకోవాలి.