Begin typing your search above and press return to search.
శ్రద్ధ... ఇక తెలుగులోకి వచ్చేయ్!
By: Tupaki Desk | 24 Dec 2015 6:53 AM GMTతెలుగు సినిమా గురించి ఎప్పుడైనా ఆలోచిస్తుంటుందో లేదో తెలియదు కానీ శ్రద్ధాకపూర్ గురించి మన ఫిల్మ్ నగర్ లో మాత్రం తరచుగా చర్చ జరుగుతుంటుంది. ఫలానా హీరో సినిమా కోసం శ్రద్ధాకపూర్ ని సంప్రదిస్తున్నారట, ఫలానా హీరో ఆమెతో కలిసి నటించాలని ఆశపడుతున్నాడట అంటూ ప్రచారాలు సాగుతుంటాయి. ఇటీవల ఎన్టీఆర్ సినిమాలో కథానాయికగా కూడా శ్రద్ధాకపూర్ పేరు తెరపైకొచ్చింది. అఖిల్ అయితే నా ఫేవరేట్ హీరోయిన్లలో శ్రద్ధ ఒకరు అని చెబుతుంటాడు. తెలుగులో అసలేమీ సినిమాలు చేయకపోయినా, హిందీలోనూ అంత పెద్ద కథానాయిక కాకపోయినా శ్రద్ధ మాత్రం మన జనాలకి భలే ఇదిగా నచ్చేసింది. మరి తెలుగు సినిమాలో శ్రద్ధ ఎప్పుడు కనిపిస్తుందో? ఆమెని తెలుగుకి తీసుకొచ్చే ప్రయత్నం విజయవంతంగా ఎవరు చేస్తారో చూడాలి. అయితే మహేష్ బావ సుధీర్ బాబు మాత్రం శ్రద్ధాకపూర్ తో తెలుగు డైలాగ్ ఒకటి చెప్పించాడు. కాస్త పెద్దదైన ఆ డైలాగ్ ని ఆమె కేవలం రెండు నిమిషాల్లోనే చెప్పేసిందట. అది చూసినవాళ్లంతా ఇక శ్రద్ధ నిరభ్యంతరంగా తెలుగులోకి వచ్చేయాల్సిందే అంటున్నారు.
శ్రద్ధాకపూర్ చెప్పిన ఆ డైలాగ్ సుధీర్ బాబు కొత్త సినిమా భలే మంచి రోజులోనిదే. డబ్ స్మాష్ కోసం శ్రద్ధాతో ఆ డైలాగ్ చెప్పించాడు. అది భలే సెట్టయ్యింది. ఆ వీడియోని ట్వీట్ చేస్తూ శ్రద్ధా ఈ డైలాగ్ ని కేవలం రెండు నిమిషాల్లోనే పట్టేసిందని చెప్పుకొచ్చాడు సుధీర్. హిందీలో టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటిస్తున్న `భాగీ`లో సుధీర్ విలన్ గా నటిస్తున్నాడు. అందులోనే శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆ అనుబంధంతో సుధీర్ శ్రద్ధాతో డబ్ స్మాష్ కోసం డైలాగ్ చెప్పించాడు. ఏమీ చేయకుండానే ఎయిడ్స్ వచ్చిపోతార్రా... అంటూ సాగే ఆ డైలాగ్ ని శ్రద్ధ తెలుగులో బాగా చెప్పింది.