Begin typing your search above and press return to search.
85 ఏళ్లలో 60 ఏళ్లు పాటకే
By: Tupaki Desk | 9 Sep 2018 6:46 AM GMT``నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ .. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ పరుగులుగా... పరుగులుగా... అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ! నాలో ఊహలకు...`` .. `చందమామ` సినిమాలోని వినసొంపైన ఈ మధురగీతం ఎవరు పాడారు? ఆ పాట విన్న తర్వాత ఆ గొంతు ఎవరిదో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలగకుండా ఉంటుందా? ఎవరికైనా. దటీజ్ ఆశా భోంస్లే. ఈ పాటను మించి ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరం లేదు.
60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సుస్వరాల్ని ఆ గొంతు నుంచి జాలువారాయి. ఆ పాటలు వినే భాగ్యం మనకు కలిగింది. దేవుడు భూమ్మీదకు పంపించిన దేవతామూర్తి ఆశాజీ అంటే అతిశయోక్తి కాదు. గానకోకిల లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే. అక్కతో పాటు పోటీపడి సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు. వందలాది పాటలు పాడి శ్రోతల్ని మెప్పించారు. ఏ ఇతర గాయనీమణికి అయినా గొప్ప ఆదర్శం. వృత్తికి అంకితమై పని చేస్తే విజయాలు పతాకస్థాయిలో అందుకోవచ్చని నిరూపించిన మేటి గాయనీమణి.
ఆశాజీ వయసు 85. అందులో 60 ఏళ్లు ఏకంగా పాటకే అంకితమిచ్చారంటే ఆ గొప్పతనాన్ని ప్రశంసించకుండా ఉండలేం. కేవలం సామాన్యులేనా - సెలబ్రిటీలు ఆశాజీకి వీరాభిమానులే. సాహో ఫేం శ్రద్ధాకపూర్ ఇదిగో ఇలా ఆశా మ్యాడమ్‌కి విష్ చేశారు. 85వ పుట్టినరోజు అయినా సెంచరీ కొట్టాలి మీ పాట. వందేళ్లు మీ పాట అభిమానుల గుండెల్లో మార్మోగాలి! అని ఆ నవ్వుతోనే శ్రద్ధా చెప్పేస్తున్నట్టు ఉంది కదూ?