Begin typing your search above and press return to search.
శ్రద్ధా ప్రేమకు తండ్రి విలన్ గా మారాడా?
By: Tupaki Desk | 30 Dec 2016 9:58 AM GMTబాలీవుడ్ లో సక్సెస్ లు సాధించడంలో శ్రద్ధా కపూర్ కు మాంచి ట్రాక్ రికార్డ్ ఉంది. రీసెంట్ గా రాక్ ఆన్2 ఈ రికార్డ్ కు బ్రేక్ వేసింది కానీ.. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఫర్హాన్ అక్తర్ తో ప్రేమాయణం సాగిస్తోందనే రూమర్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఫర్హాన్ తన భార్య అధునాకి విడాకులు ఇచ్చేసినప్పటి నుంచి.. ఏకంగా అతని ఇంట్లోనే మకాం పెట్టేసిందనే టాక్ కూడా ఉంది.
తాజాగా ఫర్హాన్ అపార్ట్ మెంట్ కి వెళ్లిన శ్రద్ధాకపూర్ తండ్రి శక్తి కపూర్.. కూతురుని అక్కడి నుంచి బలవంతంగా లాక్కొచ్చేశాడని.. జుహులోని ఇంటికి తీసుకొచ్చి.. ఫర్హాన్ తో రిలేషన్ విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. దీనిపై శక్తికపూర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. 'ఓ వారం రోజులుగా నా భార్య శివాంగితో కలిసి గోవా ట్రిప్ లో ఉన్నాను. ముంబై వచ్చాక ఈ రూమర్స్ చూసి నవ్వుకున్నాను. నా 35 ఏళ్ల కెరీర్ లో ఇలాంటివి చాలానే విన్నాను' అంటూ నవ్వేశాడు శక్తి కపూర్.
ఫర్హాన్ అక్తర్ తో శ్రద్ధా రిలేషన్ పై కూడా స్పందించడం విశేషం. 'గతంలో తను ఆదిత్య రాయ్ కపూర్ తో సినిమా చేసినపుడు.. అతనితో కూడా రిలేషన్ అంటగట్టారు. అయినా మా ఇంట్లో అంతా ఫ్రెండ్లీగా ఉంటాం. తను ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మొదట నాకే చెబుతుంది. నాకు అతను నచ్చితే ఎంచక్కా పెళ్లి చేసేస్తా' అంటూ మోడ్రన్ ఫాదర్ అనిపించుకున్నాడు శక్తి కపూర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/