Begin typing your search above and press return to search.

శ్రద్ధగా బకినీ వేస్తే.. మనస్సు జారుతోంది

By:  Tupaki Desk   |   14 March 2016 3:46 AM GMT
శ్రద్ధగా బకినీ వేస్తే.. మనస్సు జారుతోంది
X
బాలీవుడ్ హీరోయిన్లలో ఒక్కో హీరోయిన్ ది ఒక్కో రకమైన ఇమేజ్. కానీ అందరిలోను కనపించే పోలిక మాత్రం గ్లామర్ షో ఒక్కటే. ఇన్నాళ్లూ ఇలాంటివాటికి దూరంగా ఉంటూ.. కాసింత పద్ధతైన పాత్రలతో కాలం నెట్టుకొస్తోంది శ్రద్ధా కపూర్. ఇప్పుడీమె కూడా గ్లామర్ కి గేట్లు ఎత్తేసి, తాను అందరితో కలిసిపోయే ప్రయత్నం చేస్తోంది.

హోమ్లీ ఇమేజ్ తో ఛాన్సులు రావడం లోదో, లేక వస్తున్న వాటిపై సంతృప్తి కలగలేదో కానీ.. శ్రద్ధా కపూర్ ఇప్పుుడు సెన్సేషన్ సృష్టించేస్తోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న బాఘీ మూవీలో శ్రద్ధ చాలా డిఫరెంట్ గా కనిపించనుందనే అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ వచ్చినవన్నీ లీక్ లే. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో అసలు విషయం బైటపడిపోయింది. ఓ బుల్లి బికినీ లాంటి డ్రస్సులో సముద్రంలోంచి పైకి లేస్తున్న శ్రద్ధా కపూర్ ఫోటోని చూడగానే.. అభిమానుల మనసు సముద్రంలోకి జారిపోయి, అక్కడే ఉండిపోయింది.

శ్రద్ధలో ఇలాంటి యాంగిల్ ఉందా అని కొందరు, ఇలా ఎందుకు చేస్తోందో అని కొందరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇలాంటి వాటన్నిటికీ ఫైనల్ టచ్ ఇస్తున్న గ్లామర్ ప్రియులు మాత్రం.. శ్రద్ధగా ఫిజిక్ చూస్కోక, పనికిమాలిన లాజిక్కులెందుకు అని నిలదీస్తున్నారు.