Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: డోసు పెంచిన సాహో సుందరి

By:  Tupaki Desk   |   13 Aug 2018 4:39 PM GMT
ఫోటో స్టొరీ: డోసు పెంచిన సాహో సుందరి
X
ఇన్ స్టాగ్రాము బ్యూటీలంటే అటెన్షన్ సీకర్స్ అనే పొరపాటు అభిప్రాయం ఉంది కొంతమంది జనాల్లో. కొంతమంది విషయంలో అది నిజం అయ్యి ఉండొచ్చుగానీ అందరి విషయంలో అది కరెక్ట్ కాదు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ విషయంలో అసలే కాదు. ఎందుకంటే శ్రద్ధను శ్రద్ధగా 22.6 మిలియన్ల మంది 'ఐ వాన ఫాలో ఫాలో యు' అంటున్నారు.

ఇక ఆమెకు అవతల వాళ్ళను ఆకర్షించడానికి ఫోటోలు పెట్టాల్సిన అవసరమేముంటుంది? దాంతో సంబంధం లేకుండా శ్రద్ధ రెగ్యులర్ ఇంటర్వల్స్ లో ఫోటోలు పెడుతూ ఉంటుంది. శ్రద్ధకు మంచి పెర్ఫామర్, డ్యాన్సర్ అనే పేరుంది.. దాంతోపాటు పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుందని గుర్తింపు ఉంది కానీ అల్ట్రా స్టైలిష్ ఫాషన్ ఐకాన్ అనే గుర్తింపు లేదు. దీంతో ఆ ఇమేజ్ ను మార్చేందుకు రెడీ అయినట్టుంది. ఈమధ్య ఓ సెక్సీ అవతారంలో పోజిచ్చింది. తన తాజా బాలీవుడ్ చిత్రం 'బత్తి గుల్ మీటర్ చాలు' ప్రమోషనల్ ఈవెంట్ కోసం సెలబ్రిటీ స్టైలిస్ట్ తన్వి ఘావ్రి డిజైన్ చేసిన లె మిల్ వారి జిమ్మర్ మాన్ డ్రెస్ లో కన్పించింది. క్లీవేజ్ సోకులతో పాటు ఆ చిట్టి పొట్టి గౌన్లో శ్రద్ధ తన అందాలన్నింటినీ శ్రద్ధగా ధారపోసింది.

ఈ ఫోటో చూసినవాళ్లు గర్ల్ నెక్స్ట్ డోర్ అని కాదు.. అల్ట్రా మోడరన్ సూపర్ మోడల్ అని ఖచ్చితంగా అంటారు. మూడు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు ఎన్ని లైకులోచ్చాయి తెలుసా.. అక్షరాలా ఒకటీ పాయంట్ రెండు మిలియన్లు!