Begin typing your search above and press return to search.

శ్ర‌ద్ధాని వెంబ‌డించిన అదృశ్య భూతం

By:  Tupaki Desk   |   14 Sep 2019 4:27 PM GMT
శ్ర‌ద్ధాని వెంబ‌డించిన అదృశ్య భూతం
X
అవునా.. సాహో బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ వెంట బూచోడు ప‌డ్డాడా? వెంట‌ప‌డి వేధింపుల‌కు గురి చేశాడా? అంటే అవున‌నే స‌మాచారం. ఈ బూచోడు అలాంటిలాంటి బూచోడు కాదు. యాంగ్జ‌యిటీ పెంచే బూచోడు. అదృశ్య రూపంలో తిరుగుతుంటాడు. ఉన్న‌ట్టుండి తీవ్ర మైన నొప్పి భ‌రించాల్సి వ‌స్తుంది. అస‌లు ఆ నొప్పి ఎక్క‌డి నుంచి వ‌స్తుంది.. ఎలా వ‌స్తుంది? ఎందుకు వ‌స్తుంది? అన్న‌ది త‌న‌కే తెలీదు. క‌నీసం వైద్యులు కూడా క‌నిపెట్ట‌లేక‌పోయార‌ట‌.

అస‌లింత‌కీ ఆ బూచోడెవ‌రో ఇప్ప‌టికైనా క‌నిపెట్టారా లేదా? అంటే.. ఎట్ట‌కేల‌కు శ్ర‌ద్ధానే ఏదోలా తంటాలు ప‌డి క‌నిపెట్టేసిందిట‌. ఇంత‌కీ ఎవ‌రు ఆ బూచోడు? అంటే.. యాంగ్జ‌యిటీ. చాలా అరుదైన రుగ్మ‌త ఇది. ఆషిఖి 2 స‌మ‌యం నుంచి ఇది త‌న‌ని వెంటాడుతోంది. త‌న‌కు తెలియ‌కుండానే ఏదో తీవ్ర‌మైన నొప్పిని భ‌రించేస్తోంది. అయితే దీని గురించి తెలిశాక మాత్రం చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంద‌ట‌. జీవితంలో ప్ర‌తిదీ పాజిటివ్ గా వెళుతుంటే యాంగ్జ‌యిటీ అన్న‌ది ఏమీ చెయ్య‌దు. అందుకే కెరీర్ ప‌రంగా పూర్తి బిజీ అయిపోయాన‌ని చెబుతోంది. ఒక ర‌కంగా శ్ర‌ద్ధా చెబుతున్న దానిని బ‌ట్టి క్ష‌ణం తీరిక లేకుండా ఆన్ సెట్స్ బిజీ అయిపోవ‌డానికి ఈ తెలియ‌ని యాంగ్జ‌యిటీ కూడా ఓ కార‌ణ‌మ‌న్న సీక్రెట్ రివీలైంది. ఏదో అయిపోతోంది అని బతక‌డ‌మే యాంగ్జ‌యిటీ ల‌క్ష‌ణం. దీని బారిన ఎంద‌రో ప‌డ్డార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

సాహో- చిచ్చోర్ చిత్రాల‌తో బంప‌ర్ హిట్లు కొట్టింది. త‌దుప‌రి స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డి స‌హా ప‌లు భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఈ బూచోడి గురించి తెలిశాక‌.. మీలోనూ ఇలాంటి భూతం ఉందేమో చెక్ చేసుకుంటే మంచిది. శ్ర‌ద్ధా క‌పూర్ లా వార్షికాదాయం 10కోట్లు త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డొచ్చేమో! ప్చ్!