Begin typing your search above and press return to search.

డాన్ చెల్లెలి రొమాన్స్ కూడానా!!

By:  Tupaki Desk   |   13 Jun 2017 4:53 AM GMT
డాన్ చెల్లెలి రొమాన్స్ కూడానా!!
X
బాలీవుడ్లో ఘాడమైన ప్రేమకథల హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇప్పుడు ఒక సంచలన సినిమాతో రాబోతుంది. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ హాఫ్‌ విజయంతో ఇప్పుడు జోష్ లో ఉన్న శ్రద్ధా.. ఇండియా మాఫియా తీవ్రవాది దావూద్ ఇబ్రాహిం సోదరి హసీనా పార్కర్ జీవిత కథలో మెయిన్ లీడ్ గా చేస్తోంది. ఇంతకు ముందు హసీనా సినిమా పోస్టర్ విడుదల చేసినప్పుడు శ్రద్ధా కొంచం భయానకంగా చూస్తూ బొద్దుగా కనిపించింది. ఇప్పుడైతే ఏకంగా షాకే ఇచ్చారు.

హసీనా పార్కర్ జీవితంలో ముఖ్యమైన మూడు దశలును ‘హసీనా’ సినిమాగా నిర్మిస్తున్నారు. పుణె లో ఇప్పుడు షూటింగ్ జరుతుంది. మొదట హసీనా యుక్త వయసులో ఉన్నప్పటి కథను షూట్ చేస్తున్నారు. దానితర్వాత హసీనా పెళ్లి, దావూద్ గ్యాంగ్లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో షూట్ చేస్తారు. ఇప్పుడు అనుకూర్ భాటియా తో రొమాంటిక్ గా ఉన్న ఒక పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది ఇది మెట్రో లవ్ స్టోరీ కాదు మాఫియా లవ్ స్టోరీనే అని. కాకపోతే డాన్ చెల్లెలి జీవితంలో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా అనేదే ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది.

అపూర్వ లఖియా డైరెక్ట్ చేస్తున్న హసీనా లో దావూద్ ఇబ్రాహిం పాత్రను శ్రద్ధా కపూర్ అన్న సిద్ధాంత్ నటిస్తున్నాడు. హసీనా పార్కర్ పై సుమారుగా 88 కేస్లు నమోదు చేశారు కానీ హసీనా ఒకే ఒక్కసారి కోర్ట్ మెట్లు ఎక్కింది అంటే ఆమె క్రిమినల్ హిస్టరి ఎలాంటిదో మీరే ఊహించుకోండి. ముంబాయ్ మాఫియా యువరాణిగా హసీనా పాత్రలో శ్రద్ధ కపూర్ ఎలాంటి నటనను ప్రదర్శించబోతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/