Begin typing your search above and press return to search.

అదేంటి.. శ్రద్ధ అలా అనేసింది!

By:  Tupaki Desk   |   5 Sep 2019 10:28 AM GMT
అదేంటి.. శ్రద్ధ అలా అనేసింది!
X
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'సాహో' తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. 'సాహో' ఆగష్టు 30 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కరెక్ట్ గా వారం గ్యాప్ లో శ్రద్ధ నటించిన మరో చిత్రం 'చిచోరే' రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తుండగా.. నవీన్ పోలిశెట్టి.. వరుణ్ శర్మ ఇతర కీలక పోషించారు. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో 'చిచోరే' టీమ్ అంతా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

రీసెంట్ గా ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రద్ధ ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. ప్రమోషన్స్ అనే పదం వింటేనే విసుగు పుడుతోందని.. ప్రమోషన్స్ చేసి చేసి విసిగిపోయానని అనేసింది. ఈమధ్య 'సాహో' ప్రమోషనల్ కార్యక్రమాల్లో శ్రద్ధ తీరిక లేకుండా ప్రభాస్ తో కలిసి పాల్గొంది. ఇద్దరూ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రచారం చేపట్టారు. అయితే 'చిచోరే' జస్ట్ వారం గ్యాప్ లో రిలీజ్ అవుతుండడంతో శ్రద్ధా కు బ్రేక్ తీసుకునే సమయం కూడా దొరకలేదు. దీంతో ప్రమోషన్స్ పేరెత్తితేనే విసుగుపుడుతోందని సరదాగా వ్యాఖ్యానించింది. అయితే ఇష్టం ఉన్నా లేకపోయినా.. శ్రద్ధకు 'చిచోరే' ప్రమోషన్స్ ను తప్పించుకోవడం కుదరదు. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రద్ధనే.

ఇక 'చిచోరే' ప్రోమోస్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. కాలేజ్ ఫ్రెండ్స్ కామెడీ ప్లస్ ఎమోషనల్ డ్రామా కావడంతో యూత్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమాతో శ్రద్ధకు మంచి హిట్ దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.