Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: నీలిరంగులో నెరజాణ

By:  Tupaki Desk   |   5 Sep 2017 9:57 AM GMT
ఫోటోస్టోరీ: నీలిరంగులో నెరజాణ
X
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఇప్పుడు టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామకు.. అటు గ్లామర్ యాంగిల్ లోనే కాదు.. ఇటు పెర్ఫామెన్స్ రూట్ లో కూడా బోలెడంత గుర్తింపు ఉంది. పైగా మొత్తం కెరీర్ లో ఈ మధ్యన మినహాయిస్తే.. అది కూడా ఒకట్రెండు ఫ్లాప్స్ మినహాయిస్తే.. పెద్దగా పరాజయాలు చవి చూడని చరిత్ర కూడా శ్రద్ధా కపూర్ సొంతం.

అందుకే ఈ భామను సినిమాలో తీసుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తారు. ఈ వయ్యారి భామ డ్రెసింగ్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టైలింగ్ కోసం గట్టిగానే ప్రయత్నస్తూ ఉంటుంది. తాజాగా బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ గెటప్ లో రెడీ అయిపోయి ఫోటోలకు పోజులు ఇచ్చేసింది. బ్లూ కలర్ జీన్స్ కు.. ఈమె స్కిన్ టోన్ మ్యాచ్ అయిన తీరు చూస్తే.. నీలి రంగు నెరజాణ కదిలొచ్చి కెమేరా ముందు వాలినట్లుగా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు ఈ బాలీవుడ్ సుందరి అందాలను తెలుగు ప్రేక్షకులకు చూపించనున్నాడు ప్రభాస్.

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ చేస్తున్న సాహో చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న శ్రద్ధా కపూర్.. టాలీవుడ్ ఎంట్రీపై ఫుల్లు కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రస్తుతం మాఫియా క్వీన్ హసీనా పార్కర్ జీవితం ఆధారంగా రూపొందిన హసీనా సినిమా ప్రమోషన్లలో అమ్మడు ఇలా హాటు హాటుగా దర్శనమిస్తోంది. సినిమాలో ఆర్టు హీరోయిన్ లా మేకప్ లేకుండా మెరిసినా.. ఇక్కడ మాత్రం మెరుపులు మెరిపిస్తోంది ఈ నెరజాణ.