Begin typing your search above and press return to search.

మేకప్ తో భలే మ్యాజిక్ చేశారే

By:  Tupaki Desk   |   24 April 2017 6:50 AM GMT
మేకప్ తో భలే మ్యాజిక్ చేశారే
X
ప్రోస్తెటిక్స్ మేకప్.. ఇప్పుడు మన వాళ్ళు చాలా విరివిగా వాడుతున్నారు. ఒక్కపుడు ఈ వాడకం సైన్స్ ఫ్రిక్షన్ సినిమా లో ఎక్కువ గా కనిపించేది. కొత్త గా వింతగా ఒక పాత్రను తయారుచేయడానికి వాడేవారు. ఇప్పుడు చాలా సోషల్ డ్రామా మూవీస్ లో ఒకే పాత్ర తన జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనులు చెప్పాలి అంటే ఒక్కో సారి వయసు మీరిన పాత్రలు వేయవలిసి ఉంటుంది. అలాంటి పాత్రలుకు మగ వాళ్ళు ఎక్కువ గా చేస్తుంటారు. కాన్ని ఇప్పుడు హీరోయిన్లు కూడా బాగా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.

శ్రద్ధా కపూర్ కొత్త మూవీ ‘హసీనా’ నిర్మాణం లో ఉన్న విషయం తెలిసిందే. ఈ పాత్ర దావూద్ ఇబ్రాహిం సోదరీమణి హసీనా పర్కర్ జీవితం ఆధారంగా ఉంటుంది. ఆమె జీవితంలో కొంత భాగం తెర పై చూపించబోతున్నారు. దీని కోసం శ్రద్ధా ముందు టీనేజ్ గర్ల్ గా.. తరవాత యంగ్ మదర్ గా.. చివరికి 40 ఏళ్ల హసీనాగా కనిపించనున్నారు. హసీనా చాలా చిన్న వయసులోనే తల్లి అయింది. తనకు 23 వయసు ఉన్నప్పుడూ నలుగురు పిల్లలు.40 ఏళ్ల హసీనా కోసం ప్రోస్తెటిక్స్ ఉపయోగించి ఆ లుక్ ను శ్రద్దా కపూర్ పై క్రియేట్ చేశారట. ఒక ఏడాది పాటు డైరెక్టర్ అపూర్వ లఖియా మేకప్ ఆర్టిస్టులతో కూర్చుని మరి ఈ లుక్స్ డిజైన్ చేయించాడట.

మేకప్ ఆర్టిస్ట్ సుభాష్ షిండే మాటలాడుతూ “మేకప్ కోసం రోజు శ్రద్ద 3 గంటలు ముందే సెట్ కి వచ్చేది ఎందుకంటే ఎండకి ప్రోస్తెటిక్స్ మేకప్ తొందరగా పాడైపోతుంది. ఈ సినిమా కాస్ట్యూమ్ మేకప్ కోసం రెండు నెలలు ముందే సిద్దం చేశాం. శ్రద్ద.. అపూర్వ ఇచ్చిన ఇన్ పుట్స్ తీసుకొని సుమారుగా 12 ట్రైల్స్ ట్రై చేశాం ఇప్పుడు మీరు చూస్తున్న హసీనా పర్కర్ లుక్ కోసం” అని చెప్పారు. బొంబాయ్ వాళ్ళకి దావూద్ కథలు బాగానే కలిసి వచ్చాయి.. మరి వాళ్ళ చెల్లి కథ ఎలా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/