Begin typing your search above and press return to search.

శ్ర‌ద్దా క‌పూర్- రోహ‌న్ శ్రేష్ట రిలేష‌న్ బ్రేక‌ప్!

By:  Tupaki Desk   |   25 March 2022 3:29 AM
శ్ర‌ద్దా క‌పూర్- రోహ‌న్ శ్రేష్ట  రిలేష‌న్ బ్రేక‌ప్!
X
బాలీవుడ్ న‌టి శ్ర‌ద్దా క‌పూర్-సెల‌బ్రిటీ ఫోటోగ్రాఫ‌ర్ రోహ‌న్ శ్రేష్ట నాలుగేళ్ల‌గా ప్రేమించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు జంటగా చాలాసార్లు మీడియా కంటికి చిక్కారు. ప‌బ్ లు..క‌బ్ల్ లు..విదేశీ టూర్లు అంటూ తిర‌గ‌ని స్పాట్ లేదు. కొన్నాళ్లుగా ఓకే ప్లాట్ లో ఉంటూ రిలేష‌న్ ని కొన‌సాగిస్తున్నారు. ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటున్న‌ట్లు మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి. అయితే ఇప్పుడా బంధం వీగిపోయింది. నాలుగ‌ళ్ల ప్రేమ‌కి గుడ్ బై చెప్పేసారు. ఇద్ద‌రు విడిపోతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు గానీ..అందుకు గ‌ల సంకేతాలు అయితే స్ప‌ష్టంగా అందుతున్నాయి. ఇటీవ‌లే శ్ర‌ద్దా క‌పూర్ పుట్టిన రోజు వేడుక‌లు గోవాలో ఘ‌నంగా జ‌రుపుకుంది. స్నేహితులు..స‌న్నిహితులు అంతా హ‌జ‌ర‌య్యారు. కానీ ప్రియుడు రోహ‌న్ మాత్రం హాజ‌రు కాలేదు. సోష‌ల్ మీడియాలో కూడా ఎలాంటి బర్డ్ డే విషెస్ కూడా రోహ‌న్ ఖాతా నుంచి పోస్ట్ అవ్వ‌లేదు. అలాగే వేడుక‌ల సంద‌ర్భంలో శ్ర‌ద్దా క‌పూర్ సైతం రోహాన్ గురించి ఎక్క‌డా మాట్లాడింది కూడా లేదు.

దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయ‌ని..ఆ కార‌ణంగానే పుట్టిన‌ రోజులు వేడుక‌ల‌కు హాజ‌రు కాలేద‌ని..విడిపోతున్న‌ట్లు బాలీవుడ్ లో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. మ‌రి విడిపోయే అంత‌గా ఇద్ద‌రి మ‌ధ్య అంత పెద్ద స‌మ‌స్య ఏంటి? అన్న‌ది తెలియాల్సి ఉంది. బ్రేక‌ప్ లు శ్ర‌ద్ద క‌పూర్ కి కొత్తేం కాదు.

కెరీర్ ఆరంభంలో ఆదిత్య రావు క‌పూర్ తో ప్రేమ‌లో ప‌డింది. అత‌డితో కొన్నాళ్ల పాటు రిలేష‌న్ త‌ర్వాత విడిపోయారు. మ‌రో న‌టుడు ప‌ర్హాన్ అక్త‌ర్ తోనూ డేటింగ్ చేసిన‌ట్లు అప్ప‌ట్లో మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి. ఇలా ఇంత స్టోరీ క‌ల్గిన శ్ర‌ద్ద క పూర్ కొత్త ప్రేమికుడితో పెళ్లి పీఠ‌లెక్కుతుంద‌ని అంతా భావించారు. కానీ పాత సన్నివేశ‌మే మ‌ళ్లీ రిపీట్ అయింది. రోహ‌న్ తోనూ ప్రేమ వవ్య‌వ‌హారం పెళ్లి పీట‌ల వ‌ర‌కూ దారి తీయ‌లేదని క్లారిటీ వ‌చ్చేస్తుంది.

శ్ర‌ద్దా క‌పూర్ తెలుగులో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన `సాహో `చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్రభాస్ స‌ర‌స‌న న‌టించింది. ఈ సినిమాతో శ్ర‌ద్దాకి బెస్ట్ లాంచింగ్ దొరికింది. కానీ ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డం ప్ర‌తి కూలంగా మారింది. ఇక బాలీవుడ్ లో శ్ర‌ద్దాక‌పూర్ బిజీగానే ఉంది.

ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న ల‌వ్ రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తుంది. ఇంకా `చాల్ బాజ్`..`నాగిన్` లాంటి సినిమాలు చేతిలో ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప‌లువురు టాలీవుడ్ మేక‌ర్స్ కూడా ఆమెవైపు చూస్తున్నారు.