Begin typing your search above and press return to search.
మరో లేడీ అమితాబ్ కష్టమేలే
By: Tupaki Desk | 26 Sep 2017 1:30 AM GMTహీరోయిన్లు పోలీస్ పాత్రలు చేయడం అనే విషయం ఎప్పటి నుంచో ఉంది. కానీ పోలీస్ రోల్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయి.. ఆ పాత్రల కోసం ప్రాణం పెట్టేసి.. గ్లామర్ హీరోయిన్ గా తన టాప్ రేంజ్ ను వదిలేసి మరీ.. ఫిమేల్ కాప్ రోల్స్ కు క్రేజ్ తీసుకొచ్చిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి. అందుకే ఆమెకు లేడీ అమితాబ్ అనే బిరుదు కూడా దక్కింది. అయితే.. ఇప్పుడు కూడా పోలీస్ పాత్రల్లో కొందరు హీరోయిన్స్ కనిపిస్తున్నా.. వాటిని కొనసాగించే ధైర్యం ఎవరూ చేయడం లేదు.
రోజా.. రమ్యకృష్ణ.. ప్రిమయణి.. వాణి విశ్వనాథ్ లాంటి వాళ్లు కూడా పోలీస్ పాత్రల్లో మెప్పించే ప్రయత్నం చేసినా.. మళ్లీ గ్లామర్ అవతారంలోకి వచ్చేశారు. ఇఫ్పుడు కూడా ఇలాంటి పాత్రలో కనిపిస్తున్నాయి. సాయిధరం తేజ్ నటించిన సుప్రీం మూవీలో రాశి ఖన్నా.. బెల్లం శ్రీదేవి అనే పోలీస్ పాత్రలో కనిపించింది. దీన్ని కామెడీ రోల్ చేసేయగా.. ఆ తర్వాత మళ్లీ గ్లామర్ రోల్స్ లోకి వచ్చేసింది. ప్రభాస్ తో కలిసి సాహో చిత్రంలో నటిస్తున్న శ్రద్ధాకపూర్.. తను నటిస్తున్న రెండు రోల్స్ లో ఒకటి పోలీస్ రోల్ చేయనుంది. గతేడాది క్షణం మూవీలో అనసూయ కూడా పోలీస్ పాత్రను బాగా పండించింది. అయితే.. ఆ వెంటనే మళ్లీ తన స్టైల్ లో గ్లామర్ పాత్రలకు వచ్చేసింది.
పైసా వసూల్ మూవీలో కైరా దత్ తో చేయించిన ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర అయితే టూమచ్. ముందు ఆమెను ఐటెం గాళ్ గా చూపించి.. చివరకు పోలీస్ అన్నారు. ఇది అసలు జీర్ణించుకోలేని విషయం. నక్షత్రం మూవీలో ప్రగ్యాజైస్వాల్ ఈ విషయంలో బాగానే కష్టపడింది. ఫెయిల్యూర్ కారణంగా ఆమె కష్టం వేస్ట్ అయిపోయింది. పైగా హీరోయిన్స్ ఎవరూ కూడా.. విజయశాంతి మాదిరిగా పేరు తెచ్చుకోవాలని.. ఆ పాత్రలతో కెరీర్ ను మలుచుకోవచ్చని నమ్మడం లేదు. గ్లామర్ హీరోయిన్ గా సేఫ్ జోన్ లో ఉండేదుకే ప్రయత్నిస్తున్నారు.