Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సెక్సీ పెళ్ళికూతురు

By:  Tupaki Desk   |   4 May 2017 4:24 AM GMT
ఫోటో స్టోరి: సెక్సీ పెళ్ళికూతురు
X
బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో సక్సెస్ రేషియో ఎక్కువగా ఉన్న భామ శ్రద్ధా కపూర్. రాక్ఆన్2 దగ్గర బ్రేక్ పడింది కానీ.. అప్పటివరకూ అమ్మడి ఖాతాలో ఫ్లాప్ అనేదే లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. ఇంత క్రెడిట్ ఉన్నా.. ప్రముఖ మేగజైన్ కవర్ పేజెస్ పై శ్రద్ధా కపూర్ కనిపించిన దాఖలాలు బాగా తక్కువ.

కానీ కొత్త తరం పెళ్లి కూతురుగా మారిపోయిన శ్రద్ధా కపూర్.. హార్పర్స్ బజార్ బ్రైడ్ మేగజైన్ కవర్ పేజ్ పై కొత్తగా కనిపించింది. బ్లూ-పర్పుల్ కలర్ మేళవింపుతో తయారు చేసిన సవ్యసాచి లెహంగాలో.. శ్రద్ధ ఎంతో శ్రద్ధగా అందాలను చిందించేసింది. వెనక తరం గెటప్ కు.. లేటెస్ట్ జెనరేషన్ స్టయిల్ ను జోడించి ఈ భామ కనిపించిన తీరు అదరహో అనాల్సిందే. కళను ఫ్యాషన్ పెళ్లి చేసుకుంటే శ్రద్ధలా ఉంటుందంటూ పెట్టిన కొటేషన్ కు సరైన విజువలైజేషన్ ఇచ్చింది శ్రద్ధా కపూర్. క్లీవేజ్ అందాలను ఓపెన్ గా చూపించేస్తూ వేసుకున్న జాకెట్.. శ్రద్ధ గెటప్ లో అసలైన హైలైట్.

మరి పెళ్లి కూతురు కదా.. నగా నట్రా లేకపోతే ఎలా? అందుకనే వాటిని కూడా భారీగానే తగిలించేశారు కానీ.. చూపరుల కళ్లు మాత్రం ఒకచోటే ఇరుక్కుపోయి కదలనివ్వని పరిస్థితి. ఇక సినిమాల విషయానికి వస్తే హాఫ్ గాళ్ ఫ్రెండ్ చిత్రాన్ని రిలీజ్ రెడీ చేసేసిన శ్రద్ధా కపూర్.. 'హసీనా- ద క్వీన్ ఆఫ్ ముంబై' అంటూ దావూద్ ఇబ్రహీం సోదరి పాత్రలోను.. సైనా నెహ్వాల్ బయోపిక్ లోను కనిపించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/