Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ దావూద్ చెల్లెలంటగా...
By: Tupaki Desk | 31 Oct 2016 3:30 PM GMTబాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఇప్పటికే తను బాగా ట్యాలెంటెడ్ అని ప్రూవ్ చేసేసుకుంది. ఈ భామ చేతిలో ఉన్న ప్రాజెక్టులను చూస్తే.. అమ్మడి ట్యాలెంట్ పై ఫిలిం మేకర్స్ కి ఎంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో తెలిసిపోతుంది. రాక్ఆన్2.. ఓకే జాను(ఓకే బంగారం రీమేక్).. హాఫ్ గాళ్ ఫ్రెండ్ మూవీస్ తోపాటు హసీనా- ది క్వీన్ ఆఫ్ ముంబై అంటూ నాలుగు సినిమాలు శ్రద్ధా కపూర్ చేతిలో ఉన్నాయి.
అన్నీ క్రేజీ ప్రాజెక్టులే అయినా.. హసీనా గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ రోల్ ఇది. హసీనా జీవితంలో 15 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వరకూ జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. మిడిల్ ఏజ్ కి సంబంధించిన ఎపిసోడ్ ను మేకప్ తో కవర్ చేసి ట్యాలెంట్ తో ఒప్పించే అవకాశం ఉన్నా.. 15 ఏళ్ల అమ్మాయి అంటే టీనేజ్ వెర్షన్ లో చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయి. ఆమె జీవితం కీలక మలుపులు తిరిగే ఎపిసోడ్ సినిమాకు చాలా ముఖ్యం.
ఈ ఎపిసోడ్ ను వేరే టీనేజ్ అమ్మాయితో తీసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నా.. తనే ఆ ఏజ్ ఎపిసోడ్ చేస్తానని పట్టుపట్టిందట శ్రద్ధ. అందుకు తగ్గట్లుగా తన బాడీలో మార్పులను కూడా చూపిస్తానని చెప్పి.. ఓ శాంపిల్ కూడా చూపించిందట. శ్రద్ధా కపూర్ నుంచి ఈ రేంజ్ లో సపోర్ట్ వచ్చేసరికి ఉబ్బితబ్బియిన దర్శకుడు అపూర్వ లఖియా.. ఈ మేరకు బాడీలో మార్పులు వచ్చేందుకు కొంత టైమ్ ఇచ్చాడట కూడా. అలా 30 ఏళ్ల ఈ బ్యూటీ ఇప్పుడు 15ఏళ్ల లుక్ ని చూపించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/