Begin typing your search above and press return to search.

తెలుగు డబ్బింగ్ కు సిద్ధం అంటున్న శ్రద్ధ

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:50 AM GMT
తెలుగు డబ్బింగ్ కు సిద్ధం అంటున్న శ్రద్ధ
X
ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' కోసం అభిమానులు చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే సమాచారం ఇంతవరకూ లేకపోయినా 'సాహో' సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తోనే సరిపెట్టుకుంటున్నారు. తాజాగా 'సాహో' కు సంబంధించిన మరో అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా శ్రద్ధ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక హిందీ భామ కాబట్టి తెలుగు రాదు.. డబ్బింగ్ ఎవరైనా ప్రొఫెషనల్ చేత చెప్పించాల్సిందే. కానీ శ్రద్ధకు తన ప్రొఫెషన్ పై శ్రద్ద చాలా ఎక్కువ. సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి వీలైనంతగా తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టిందట. తెలుగు విషయం లో హీరో ప్రభాస్ తనకు సహకారం అందిస్తున్నాడని కూడా ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. డైలాగ్స్ చెప్పే సమయంలో ప్రాంప్టింగ్ లేకుండా సొంతంగానే చెప్పుకుందట. ఇప్పుడు తెలుగులో సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని రెడీ అయిందట.

శ్రద్ధ ఓన్ డబ్బింగ్ కు డైరెక్టర్ సుజిత్ సరే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం గడగడా తెలుగు మాట్లాడుతుందట. శ్రద్ధ ఓన్ డబ్బింగ్ కు సరే అంటాడో లేదా ప్రోఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కు ఓటేస్తాడో వేచి చూడాలి. ఏదేమైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడానికి ముందుకు రావడం హర్షించదగిన పరిణామమే!