Begin typing your search above and press return to search.

పెళ్లిళ్లు పేరంటాళ్ల‌కు క‌లిసే జంట‌గా.. ఏంటి క‌థాక‌మామీషు?

By:  Tupaki Desk   |   6 Feb 2021 12:30 AM GMT
పెళ్లిళ్లు పేరంటాళ్ల‌కు క‌లిసే జంట‌గా.. ఏంటి క‌థాక‌మామీషు?
X
గ‌త కొంత‌కాలంగా సాహో శ్ర‌ద్ధా క‌పూర్ ప్రేమాయ‌ణంలో మునిగి తేలుతోంద‌ని.. సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ తో షికార్లు చేస్తోంద‌ని ర‌క‌ర‌కాల గాసిప్పులు ముంబై మీడియాలో షికార్ చేస్తున్నాయి. వ‌న్ ఫైన్ డే సాటి ముంబై బ్యూటీ కాజల్ త‌ర‌హాలోనే ఈ అమ్మ‌డు కూడా ఓపెన్ అవుతుందా? అంటూ చ‌ర్చా సాగుతోంది. అస‌లింత‌కీ ఎవ‌రా బోయ్ ఫ్రెండ్? అన్న‌ది ఆరా తీస్తే..

చిన్న నాటి స్నేహితుడు రోహ‌న్ శ్రేష్ఠ‌తో గుట్టు చ‌ప్పుడు కాకుండా శ్ర‌ద్ధా షికార్లు చేస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ జంట ప్రియాంక్ శర్మ వెడ్డింగ్ విందుకు హాజరయ్యారు. శ్రద్ధా కపూర్ బంధువు ప్రియాంక్ శర్మ అతని చిరకాల ప్రేయసి షాజా మొరాని గురువారం ఉదయం రిజిస్ట‌ర్డ్ వివాహం చేసుకున్నారు. తరువాత ముంబైలో స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం ఒక పార్టీని నిర్వహించారు. పార్టీలో శ్రద్ధా-శ్రేష్ఠ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ప్రియాంక్ కజిన్ పెళ్లి వీడియోల్లో ఆ సీక్రెట్ ప్రేమ‌గువ్వ‌ల జంట‌ హైలైట్ అయ్యింది.

ఇటీవ‌ల‌ శ్రద్ధా - రోహన్ వివాహం గురించి సోషల్ మీడియాలో విప‌రీత‌మైన ప్ర‌చారం సాగుతోంది . అక్క‌డికీ ఓ ముంబై ఫోటోగ్రాఫర్ ఆగ‌లేక మరాఠీలో శ్ర‌ద్ధా పెళ్లి గురించి త‌న‌నే అడిగేశాడ‌ట‌. ఓయ్.. ఏమ‌ని అంటున్నావు!! అంటూ శ్ర‌ద్ధా ఫ‌న్నీగా మాట్లాడి జ‌వాబును దాట‌వేసింద‌ట‌.