Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: సాహో స్త్రీ తో డేంజరట
By: Tupaki Desk | 30 Aug 2018 4:24 PM GMTశ్రద్ధ కపూర్ బాలీవుడ్ సుందరే గానీ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' లో హీరోయిన్ పాత్రకు ఒప్పుకోవడంతో తెలుగు వాళ్ళందరికీ స్వీట్ డార్లింగ్ అయిపోయింది. అలా అని ఆమె స్వీట్ వార్నింగ్ ఇస్తుందనుకుంటే మీరు డెఫినిట్ గా పప్పులో కాలేసినట్టే. ఆమె రేపు శుక్రవారం 'స్త్రీ' అనే హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇంతకీ సినిమాలో శ్రద్ధ ఏం చేస్తుందంటే ఒక దెయ్యంగా నటిస్తోందట. ఆరు బయట ఆరామ్ గా తిరుగుతున్న మగమహారాజుల తోలు వలిచి రక్తం తాగి చంపుతుందట! ఏంటో.. ఈ బాలీవుడ్ బ్యూటీ దెయ్యాలు.. అల్ ఖైదా తీవ్రవాదుల కంటే అరవై రెట్లు ఎక్కువ భయం పుట్టించేలా తయారయ్యారు. ఈ విషయాన్ని పాలిష్డ్ గా శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ లో ఎలా చెప్పిందంటే "ఈ నగరంలో స్త్రీ బారినుండి మగాళ్ళకు భద్రత ఉందా లేదా?"
ఇదంతా సినిమా ప్రమోషన్ లో భాగమే కానీ ఆమెను ఫాలో అయ్యే నెటిజనులు మాత్రం అసలు భయపడడం లేదు. ఒకడు క్యూటి అంటే మరొకరు బ్యూటీ అంటున్నారు. ఒకడు నంబరిచ్చి ఫోన్ చేయమంటున్నాడు. సాహో స్త్రీ ఎంత భయపెట్టినా 1.3 మిలియన్ లైకులు వచ్చాయి. ఈ మగాళ్ళను భయపెట్టడం చాలా కష్టం శ్రద్ధా. నువ్వు భయపెడితే వాళ్ళు లైకులు కొడుతున్నారు. వాళ్ళ దృష్టి అంతా శ్రద్ధ శ్రద్దగా వేసుకున్న చిట్టిపొట్టి గౌనుపైనే!