Begin typing your search above and press return to search.

డార్లింగ్ కు శ్రద్ధగా వెల్కం చెప్పిందే

By:  Tupaki Desk   |   27 April 2019 11:41 AM GMT
డార్లింగ్ కు శ్రద్ధగా వెల్కం చెప్పిందే
X
ఇది అసలే సోషల్ మీడియా కాలం. మెజారిటీ జనాలు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉంటారు. ఇక యూత్ సంగతి అయితే చెప్పనవసరమే లేదు. అందుకే దాదాపు సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఫేస్ బుక్ లో మాత్రమే ఉన్నాడు. ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు ఖాతా తెరుస్తాడని సౌత్ నుంచి నార్త్ వరకూ ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూశారు. ఇంకా రెబెల్ స్టార్ ట్విట్టర్లో ఎంట్రీ ఇవ్వలేదు కానీ ఈమధ్యే ఇన్స్టా లో అరంగేట్రం చేశాడు.

ప్రభాస్ ఎంట్రీ మామూలుగా లేదు. ఫస్ట్ పోస్ట్ అసలు చేయకముందే 7 లక్షల మంది ఫాలో అయ్యారు. ఇక ఫస్ట్ పోస్ట్ చేయగానే నెటిజనులు లైక్స్ తోనూ.. కామెంట్స్ తోనూ హోరెత్తించారు. దాదాపు అన్నీ వెల్కం మెసేజిలే. ఇప్పటికి ప్రభాస్ ఇన్స్టా ఎంట్రీ ఇచ్చి పది రోజులయింది. ఇప్పటివరకూ ప్రభాస్ కు 1.3 మిలియన్ ఫాలోయర్లు వచ్చారు. ప్రభాస్ ఖాతాను ఇన్స్టాగ్రామ్ వారు వెరిఫై చేసి బ్లూ-వైట్ డిజైన్ లో ఉండే టిక్ మార్క్ కూడా ఇచ్చేశారు. ఇక ఈరోజు ఏకంగా 'సాహో' బ్యూటీ శ్రద్ధా కపూర్ డార్లింగ్ కు వెల్కమ్ చెప్పింది.

ఎకౌంట్ ను ఇన్స్టాగ్రామ్ వారు వెరిఫై చేసినంతవరకూ వేచి చూసి ఇప్పుడు వెల్కం చెప్పడం విశేషం. ప్రభాస్ ఫస్ట్ పోస్ట్ ను తన ఖాతా ద్వారా రీ పోస్ట్ చేస్తూ "ఇన్స్టా కు స్వాగతం!! నేను ఇప్పటివరకూ కలిసిన వారిలో ఒక అద్బుతమైన డార్లింగ్. @actorprabhas" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. జస్ట్ ఎనిమిది గంటల్లోనే ఈ పోస్ట్ కు 1.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ ఫోటోకు కామెంట్స్ లో చాలామంది నెటిజనులు 'సాహో' కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.