Begin typing your search above and press return to search.

అయ్యా.. బ్యూటీ మరీ ఇంత బోల్డా!

By:  Tupaki Desk   |   1 May 2019 10:18 AM GMT
అయ్యా.. బ్యూటీ మరీ ఇంత బోల్డా!
X
మన సమాజం అంతా అదో రకంగా ఉంటుంది. మెజారిటీ జనాలు చేసేది చెప్పరు.. చెప్పింది అసలు చెయ్యరు. అందరూ డబ్బు ముఖ్యం కాదని పైకి అంటూ ఉంటారు. కానీ డబ్బు కోసం మురుగు కాలువ పక్కన ఉన్న గడ్డిని కూడా ఇష్టంగా తింటారు. ఇలాంటి జనాల మధ్యలో ఓపెన్ గా మాట్లాడడం చాలా కష్టం. పొగరు అంటారు.. బోల్డ్ అంటారు. కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ వరస చూస్తుంటే ఆమె ఈ సమాజానికి వ్యతిరేకంగా బోల్డ్ గా ఉన్నట్టుంది.

కొద్ది రోజుల క్రితం తెలుగు 'U టర్న్' చూశారా అని అడిగితే 'అరగంట కంటే ఎక్కువ చూడలేక ఆపేశాను' అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. సమంతా సినిమా గురించి అలా కామెంట్ చెయ్యడం ఏంటని జనాలు చెవులు కొరుక్కున్నారు. ఈ ఎపిసోడ్ ను ఫ్రాంక్ గా చూస్తే.. అందులో తప్పేముంది. ఒక సినిమా శ్రద్ధా కు నచ్చలేదు.. నచ్చలేదని చెప్పింది. మనకు కావాల్సింది అది కాదు కాదా? యూ టర్న్ సూపర్.. సమంతా సూపర్ అని చెప్పాలి. అలా చెప్పకపోయేసరికి శ్రద్ధా హాట్ టాపిక్ అయింది.. అందుకే కొందరి శ్రద్ధాను విమర్శించారు. అయితే శ్రద్ధా ఆ విమర్శలను అసలు పట్టించుకోలేదు.

ఇదిలా ఉంటే తాజగా శ్రద్ధా మరింత బోల్డ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా శ్రద్ధ స్లీవ్ లెస్ టాప్ వేసుకొని జుట్టును సవరించుకుంటూ క్లిప్ పెట్టుకునే విడియో ను షేర్ చేసింది. అలా సరి చేసుకుంటూ కొందరు తన అండర్ అర్మ్స్ ను ఇష్టపడతారని.. వాళ్ళు చూసుకోవచ్చని కామెంట్ చేసింది. శివశివా.. అని సంప్రదాయవాదులు షాక్ కు గురి కావచ్చు. ఈ జెనరేషన్ జనాలు మాత్రం రౌడీ హీరో విజయ దేవరకొండ కు లేడీ వెర్షన్ లాగా ఉందే అని ముచ్చట పడొచ్చు. రౌడీ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా ప్రదానం చెయ్యొచ్చు. ఎవరి రిసీవింగ్ ఫ్రీక్వెన్సీ వారిది!