Begin typing your search above and press return to search.

యూ-టర్న్ భామ గ్లామ్ పోజులు

By:  Tupaki Desk   |   18 May 2017 5:59 AM GMT
యూ-టర్న్ భామ గ్లామ్ పోజులు
X
సాధారణంగా అందం ప్లస్ ప్రతిభ రెండూ ఒకచోట ఉండవంటారు. అలాగని ప్రతిభ చూపించే వాళ్లు అందగత్తెలు కాదని కాదు. కానీ కొంతమంది మంతి ట్యాలెంటెడ్ భామలు మాత్రం అందాన్ని చూపించడంలో బాగా పొదుపు పాటించేస్తుంటారు. ఇలాంటి వారిలో కన్నడ యూ-టర్న్ భామ శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఉంటుంది.

మలయాళ మూవీ కోహినూర్ తో పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్.. యూ టర్న్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ్- కన్నడ సినిమాల్లో వరుసగా చేసేస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ గా మణిరత్నం మూవీ కాట్రు వెలియిదాయ్ లో కూడా ఓ రోల్ లో కనిపించింది. ఎక్స్ పోజింగ్ విషయంలో బాగా పొదుపు పాటించడంలో ఈమె ముందుంటుంది. గ్లామర్ పాత్రలకు తాను అంతా సెట్ కానన్నది ఈమె ప్రగాఢ విశ్వాసం. అందుకే వీటికి దూరంగానే ఉంటుంది కానీ.. తాజాగా మాత్రం ఈ నిర్ణయాన్ని కొంచెం సడలించినట్లుగా కనిపిస్తోంది.

రకరకాల పోజులతో రెచ్చగొట్టే టైపులో పోజులు ఇచ్చి ఓ ఫోటో షూట్ చేసింది శ్రద్ధా శ్రీనాథ్. అలాగని శృతి మించి ఎక్స్ పోజింగ్ చేసేయలేదు కానీ.. కొన్ని కొన్ని యాంగిల్స్ లో ఈ భామ గ్లామరసం బాగానే చిందించింది. కెరీర్ లో యూ-టర్న్ కావాలంటే ఈ మాత్రం మార్పు కావాల్సిందే కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/