Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్ షాకింగ్ డెసిష‌న్‌..పిల్ల‌లు వ‌ద్ద‌ట‌..!

By:  Tupaki Desk   |   5 Sep 2019 7:28 AM GMT
నాని హీరోయిన్ షాకింగ్ డెసిష‌న్‌..పిల్ల‌లు వ‌ద్ద‌ట‌..!
X
నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న జెర్సీ సినిమాలో న‌టించిన శ్ర‌ద్ధా శ్రీనాథ్ అంద‌రికి గుర్తుంటుంది. ఆ సినిమాలో ఆమె న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల నుంచి కూడా మంచి మార్కులే ప‌డ్డాయి. తాజాగా ఆమె ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. ఆమె పిల్ల‌ల‌ను క‌న‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యారు. త‌న దృష్టిలో రేప్ అన్న‌ది మాత్ర‌మే నేరం కాద‌ని... కాలం మారుతున్నా... మ‌హిళ‌ల‌పై స‌మాజం చూసే దృష్టిలో ఏ మాత్రం మార్పులేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

స‌మాజంలో మ‌హిళ‌ల‌ను త‌క్కువ దృష్టిలో చూసేవాళ్లు ఇప్ప‌టికీ ఎక్కువ మందే ఉన్న నేప‌థ్యంలో కొంద‌రు వివాహాల‌కే దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు శ్ర‌ద్ధా శ్రీనాథ్ కూడా ఇదే బాట ప‌ట్టారు. ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ చాలా మంది రేప్ అన్న‌ది మాత్ర‌మే నేరంగా చూస్తారని... అయితే మ‌హిళ‌ల‌ను త‌ప్పుడు దృష్టితో చూడ‌డం..అనుస‌రించ‌డం కూడా నేర‌గా అని చెప్పింది. కాలంతో పాటు మ‌హిళ‌ల్లో కూడా మార్పు వ‌స్తోందని... ఈ క్ర‌మంలోనే తాను అస్స‌లు పిల్ల‌ల‌ను క‌న‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఆమె తెలిపింది.

త‌న తాత‌ - బామ్మ‌ల‌కు 15 మంది పిల్ల‌ల‌ని... త‌న త‌ల్లిదండ్రులు ఇప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మిన‌చ్చార‌ని.. ఇక తాను పిల్ల‌ల‌ను క‌న‌రాద‌ని డిసైడ్ అయిన‌ట్టు చెప్పింది. త‌న డెసిష‌న్‌ తో త‌న‌ను మ‌రోలా చూడ‌వ‌ద్ద‌ని... త‌న చ‌దువు - తెలివితేట‌ల‌ను బ‌ట్టే తీర్మానించుకోవాల‌ని కూడా చెప్పింది. శ్ర‌ద్ధ ప్ర‌స్తుతం తెలుగులో జోడి అనే చిత్రంలోనూ కన్నడంలో గోద్రా చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో ఇరుంబుతిరై 2 - మార చిత్రాల్లో నటించనుంది.