Begin typing your search above and press return to search.
జై నానీ అన్న.. ఏంటా పిలుపు శ్రద్ధా?
By: Tupaki Desk | 16 April 2019 5:31 AM GMTనేచురల్ స్టార్ నాని సరసన జెర్సీ చిత్రంలో కథానాయికగా నటించింది శ్రద్ధా శ్రీనాథ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ క్రికెట్ నేపథ్య చిత్రం ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జెర్సీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో శ్రద్ధా శ్రీనాథ్ స్పీచ్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఈ వేదికపై యాథృచ్ఛికంగానో లేక ఎమోషన్ లోనో శ్రద్ధా కాస్త టెంప్టింగ్ గా కనిపించింది. అంతేనా హీరోని ఉద్ధేశించి ప్రసంగిస్తూ అభిమానుల కేరింతల నడుమ `జై నాని అన్నా` అంటూ పిలిచేసింది. దాంతో నాని ఫ్యాన్స్ కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. వేదిక దిగువన నానీ మాత్రం `ఏ గుడ్ సాంగ్ ఫర్ సింగింగ్!` అన్న తీరుగా నిశ్చేష్ఠుడై వేదికపై ఉన్న శ్రద్ధాని అలా చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి ఆ దృశ్యం అహూతుల్ని ఆకట్టుకుంది. జెర్సీ చిత్రంలో శ్రద్ధా అతడి లవర్ గా.. భార్యగా నటించిన సంగతి తెలిసిందే. దాంతో నాని అన్న అనేసిందేం? అంటూ వేదిక దిగువన అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగింది.
ఎందుకనో జెర్సీ వేదికపై శ్రద్ధ ఎంతో ఎమోషన్ అవ్వడం అభిమానులకు కనిపించింది. నాలుగేళ్లుగా టాలీవుడ్ లో అలుపెరగని పోరాటం చేస్తున్న ఈ బెంగళూరు బ్యూటీకి అసలు ఆశించినదేదీ వెంటనే జరగలేదు. ఏదీ కలిసిరాలేదు. రెండు సినిమాలు ఎప్పుడో మొదలై అంతకంతకు ఆలస్యమవుతుంటే .. వాటన్నిటికంటే ఆలస్యంగా మొదలైన `జెర్సీ` ముందుగా రిలీజవుతుండడంతో కాస్త రిలీఫ్ నిచ్చినట్టుంది. ఆ ఆనందంలో ఎమోషన్ తట్టుకోలేకపోయిన శ్రద్ధా వేదికపై ఎగ్జయిట్ అవుతూ తడబడుతూ మాట్లాడింది. ఇలాంటి ఓ మంచి రిలీజ్ కోసమే వేచి చూస్తున్నానని శ్రద్ధ ఎమోషనల్ అయ్యింది.
శ్రద్ధ శ్రీనాథ్ జెర్సీ వేదికపై మాట్లాడుతూ.. ``కన్నడలో యూటర్న్ మొదటి సినిమా. తెలుగులో నాలుగేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా. తొలిసారి నటించినప్పుడు కెమెరా లెన్స్ అంటే ఏమిటి.. లైటింగ్.. షాట్స్ ఇవేవీ తెలియకుండానే నటించాను. నటన తప్ప నాకు ఏదీ తెలీదు. నా పని నేను చేశాను. జెర్సీ నా మొదటి సినిమాగా రిలీజవుతుండడం ఆనందాన్నిస్తోంది`` అని తెలిపింది. ఓవైపు నాని అభిమానులు గోల చేస్తుంటే.. `జై నానీ అన్న!` అంటూ తాను కూడా ఎగ్జయిట్మెంట్ ప్రదర్శించింది.