Begin typing your search above and press return to search.

జెర్సీ భామ గట్స్ మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   22 April 2019 4:47 AM GMT
జెర్సీ భామ గట్స్ మామూలుగా లేవుగా?
X
చిక్కు ప్ర‌శ్నల‌తో ఇబ్బంది పెట్టాల‌న్న వ‌ల‌లో చిక్కుకోకుండా తెలివిగా స‌మాధానం చెప్పేయ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చూసి ఉంటాం. కానీ.. నిజాన్ని నిర్భ‌యంగా చెబితే న‌ష్ట‌మేంద‌న్న తీరును ప్ర‌ద‌ర్శించి.. అంద‌రి దృష్టి త‌న మీద ప‌డేలా చేసుకున్నారు జెర్సీ భామ శ్ర‌ద్దా శ్రీ‌నాథ్‌. టాలీవుడ్‌లో ఏ హీరోయిన్ అయినా.. ఇద్ద‌రు ప్ర‌ముఖ హీరోల పేర్లు చెప్పి.. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రి న‌ట‌న బాగుంద‌న్న ప్ర‌శ్న‌కు.. కర్ర విర‌క్కుండా.. పాము చావ‌ని రీతిలో రోటీన్ స‌మాధానం చెప్ప‌టం చూశాం.

కానీ.. ఇందుకు భిన్నంగా స‌మాధానం చెప్పి.. త‌న‌లోని గ‌ట్స్ ను చెప్పక‌నే చెప్పేసింది జెర్సీ బ్యూటీ. అంతేనా.. మ‌రో ప్ర‌శ్న‌కు ఓపెన్ గా చెప్పేసి.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబితే ఇబ్బందులు ఎదురవుతాయ‌న్న జ‌వాబుతో.. తెలుగు మీడియాకు కొత్త త‌ర‌హా అనుభ‌వాన్ని మిగిల్చిన క్రెడిట్ శ్ర‌ద్ధ‌కే చెల్లుతుంది.

జెర్సీ మూవీ రిలీజ్ నేప‌థ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ మీడియాతో మాట్లాడారు. లుక్స్ ప‌రంగానే కాదు.. న‌ట‌న విష‌యంలోనూ మంచి మార్కులు కొల్ల‌గొట్టిన ఆమెను మీడియా ప్ర‌తినిధి ఒకరు చిక్కు ప్ర‌శ్న వేశారు. న‌ట‌నప‌రంగా మీరు య‌శ్ (క‌న్న‌డ టాప్ హీరో).. నాని ల‌లో ఎవ‌రిని ఎంచుకుంటారు? అని అడిగినంత‌నే.. ఏ మాత్రం ఆలోచించ‌కుండా నాని పేరు చెప్పేసింది.

తాను నాని లాంటి స్టార్ తో క‌లిసి ప‌ని చేశాన‌ని.. అందుకే య‌శ్ ను కాకుండా నానిని ఎంచుకున్న‌ట్లు చెప్పింది. య‌శ్ కూడా త‌న‌కొచ్చిన స్టార్ డ‌మ్ కోసం చాలానే క‌ష్ట‌ప‌డ్డార‌ని.. సినిమాల్లో రాక ముందు టీవీ న‌టుడిగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో త‌న‌కు తెలుస‌న్నారు. కేజీఎఫ్ మూవీతో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ స‌త్తాను ప్ర‌పంచానికి చాటార‌ని అత‌డి గొప్ప‌త‌నాన్ని చెప్పారు.

ఇష్ట‌మైన చిత్ర ప‌రిశ్ర‌మ ఏద‌న్న చిక్కు ప్ర‌శ్న‌కు త‌న‌దైన రీతిలో జ‌వాబిస్తే.. అన్ని చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లు ఇష్ట‌మేన‌ని.. తాను ప‌నిని వృత్తిప‌రంగా చూస్తాన‌ని.. కాబ‌ట్టి వాటిల్లో ఇష్ట‌మైంద‌న్న‌ది ఏద‌న్న‌ది ఎంపిక చేసుకోన‌న్నారు. త‌న‌కు ఫ‌లానా ఇండ‌స్ట్రీ ఇష్ట‌మని చెబితే అభిమానుల్ని కోల్పోతాన‌ని అస‌లు విష‌యాన్ని ఓపెన్ గా చెప్పేసింది. ఇంత ఫ్రాంక్ గా.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే గ‌ట్స్ జెర్సీ బ్యూటీకే సొంత‌మ‌ని చెప్పాలి.