Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : వైట్ అండ్ వైట్.. అమ్మడి అందాలు వేరే లెవల్..!

By:  Tupaki Desk   |   10 Dec 2022 11:03 AM GMT
ఫోటో స్టోరీ : వైట్ అండ్ వైట్.. అమ్మడి అందాలు వేరే లెవల్..!
X
టాలీవుడ్ లో 14 ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ సినిమాల్లో అక్కడక్కడ కనిపిస్తున్న బెంగాలి బ్ణామ శ్రద్ధా దాస్. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధ దాస్ కొన్నాళ్లు సోలో హీరోయిన్ గా చేయగా ఆ తర్వాత సైడ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చింది. ఇక ఎలాగోలా సినిమాల్లో కనిపించాలని ఇలా వచ్చి అలా వెళ్లే పాత్రల్లో కూడా అమ్మడు చేస్తూ వచ్చింది.

తెలుగు, కన్నడ, హిందీ ఇలా మూడు భాషల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ వచ్చిన శ్రద్ధా దాస్ తెలుగులో చివరగా ఏక్ మిని కథలో నటించింది.

సినిమాలో కూడా చిన్న పాత్రలో సరిపెట్టుకుంది. టాలీవుడ్ లో ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న అమ్మడికి సినిమాల్లోనే కాదు బుల్లితెర మీద అవకాశాలు వస్తున్నాయి. ఢీ షో ప్రస్తుత సీజన్ లో ఆమె వన్ ఆఫ్ ది జడ్జ్ గా ఉన్నారు.

రీసెంట్ గానే ఆ సీజన్ పూర్తి కాగా నెక్స్ట్ సీజన్ కి కూడా ఆమె వస్తారని తెలుస్తుంది. ఇక సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా పాపులర్ అయిన శ్రద్ధ దాస్ లేటెస్ట్ గా వైట్ కలర్ లెహంగాతో ఊరిస్తుంది. తనలోని హాట్ నెస్ తో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్న శ్రద్ధ గ్లామర్ షోలో ఎలాంటి లిమిట్స్ లేవని అంటుంది.

సినిమాల్లో కన్నా ఆమెకు ఇలాంటి ఫోటో షూట్స్ వల్లే ఛాన్సులు వస్తున్నాయని చెప్పొచ్చు. శ్రద్ధా దాస్ లేటెస్ట్ వైట్ అండ్ వైట్ ఫోటో షూట్ మాత్రం అప్సరస ఏమన్నా దివి నుంచి భువికి వచ్చిందా అనేలా ఉంది. రెచ్చిపోవడంలో తనని మించిన వారు లేరనేలా శ్రద్ధ చేసే ఫోటో షూట్స్ క్రేజీగా ఉంటున్నాయి. వాటిలో ఈ వైట్ డ్రెస్ ఫోటో షూట్ మాత్రం ఎక్కువ డిస్కషన్స్ లో ఉంది.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో నిరీక్షణ, అర్ధం సినిమాల్లో నటిస్తుంది అమ్మడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. ఇలా అయినా తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉండేందుకు సూపర్ ప్లాన్ చేస్తుంది అమ్మడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.