Begin typing your search above and press return to search.
ఇంకో తెలుగమ్మాయ్.. తమిళ జంప్
By: Tupaki Desk | 23 July 2015 9:54 AM GMTలవ్ యు బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రావ్య. 21 వయసు ఈ తెలుగమ్మాయ్ హ్యాపీడేస్ ఫేం రాహుల్ సరసన నటించింది. శ్రావ్య నటన బావుంది కానీ, సినిమా హిట్టవ్వలేదు. ఫలితం సెంటిమెంటు పరిశ్రమలో ఛాన్సులే కరువైన పరిస్థితి. సరిగ్గా అలాంటి టైమ్ లో అందరు తెలుగమ్మాయిల్లానే తమిళ తంబీల్ని నమ్ముకుని కోలీవుడ్ లో అడుగుపెట్టింది.
ఇప్పటికిప్పుడు శ్రావ్య వెళ్లికిఝమై 13ఎఎం తేథీ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పుగల్ మణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరిన్ని కథలు విని సంతకాలు చేయడానికి రెడీ అవుతోంది. కోలీవుడ్‌లో తొలి అవకాశం ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు శ్రావ్య ఎంతో ఎగ్జయిటింగ్ గా సమాధానమిచ్చింది. దర్శకుడు అనుకోకుండా నన్ను చూశారు. వెంటనే ఆఫర్ చేసేశారు. ఆడిషన్ చేసి ఎంపిక చేసేసుకున్నారని చెప్పింది. అంతేనా తన ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన 'ఓకే బంగారం' చూశాక స్టన్నయిపోయా. అలాంటి అవకాశం నాకు ఎందుకు రాలేదు? అని కాస్త ఇదయ్యానని చెప్పింది శ్రావ్య.
ఒకవేళ లవ్ యు బంగారం స్థానంలో ఈ తెలుగమ్మాయికి 'ఓకే బంగారం'లో చేసే ఛాన్సొస్తే ఎలా ఉండేదో ఓసారి ఊహించుకోండి. ఒకే ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు.. ఈ అమ్మడి జీవితం మారిపోయి ఉండేదే. దేనికైనా రాసిపెట్టి ఉండాలి.