Begin typing your search above and press return to search.
డ్రగ్స్ తీసుకునే సీన్ ఆ హీరోయిన్ కు లేదు
By: Tupaki Desk | 6 Sep 2017 9:46 AM GMTఅర్జున్ రెడ్డి. ఈ సినిమా పేరు వింటేనే కొంతమంది ఉత్సాహం కలిగితే కొంతమందికి కోపాలు వచ్చేస్తున్నాయి. బూతులు డ్రగ్స్ అని కొందరు అంటుంటే.. అవన్నీ బూతులు కాదు నీతులు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇన్నేసి వివాదాల మధ్యన సినిమా మాత్రం చక్కగా ఆడేస్తోంది. అయితే ఈ సినిమాపై వి.హనుమంతరావు వంటి పోలిటీషియన్ కామెంట్లు చేశాక.. యాంకర్ అనసూయ ఈ టీమ్ బూతులపై విరుచుకుపడ్డాక.. ఇప్పుడు మరో నటీమణి కూడా బయలుదేరింది.
అంతగా పాపులర్ అవ్వని ఓ హీరోయిన్ శ్రావ్యా రెడ్డి ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలోని ఒక లాజిక్ చెబుతూ.. మరోవైపు లాజిక్ లేకుండా కామెంట్ చేస్తోంది. ''నాకు చాలా తక్కువ సినిమాలు చూసినప్పుడు తలనొప్పి వస్తుంది. దానిలో ఒకటి అర్జున్ రెడ్డి. అసలు కామెడీ ఏంటంటే.. అర్జున్ రెడ్డి దేష్ముఖ్ హీరో పేరైతే.. అర్జున్ రెడ్డి అని ఎందుకు పెట్టారో తెలియలేదు. అసలు రెడ్డి కులంలో ఎవరికీ దేశ్ముఖ్ అనే పేరే ఉండదు. నాకు అది అసహ్యమేసింది'' అంటూ సినిమా టైటిల్ పై కామెంట్ చేసింది. ''సినిమాతో మీరు ఏం చెప్పాలని అనుకున్నారు డైరక్టర్ గారూ? లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ చేసుకోమనా??'' అని ప్రశ్నించింది. ఈ పాయంట్లు బాగానే ఉన్నాయిలే.
ఇకపోతే హీరోయిన్ గురించి ప్రస్తావిస్తూ.. ''ఆ హీరోయిన్ ఫేసుకు యుద్దాలు చేసేంత.. డ్రగ్ ఎడిక్ట్ అయ్యేంత సీన్ లేదు'' అనేసింది. బహుశా సినిమాపై ఈమె ఒపీనియన్ ఈమెకు ఉండొచ్చు కాని.. 'ఆ హీరోయిన్ ఫేసుకు' అంటూ సాటి మహిళపై అలాంటి కామెంట్ చేయడం నెటిజన్లకు నచ్చలేదు. అందాన్ని బట్టి ప్రేమించరు.. అది కేవలం సినిమాల్లో జరుగుతుంది. బయట ఎలా ఉన్నవారైనా ప్రేమించుకుంటారు. అందగత్తెలను ప్రేమించి బ్రేకప్ అయితేనే బాధపడాలి.. అనే రూల్ లేదు. అసలు అలా మరో నటీమణిపై ఇంకో నటీమణి ఇలాంటి కామెంట్లు చేయడం.. కేవలం అక్కసుతో చేస్తున్నవే అంటున్నారు నెటిజన్లు.