Begin typing your search above and press return to search.
పోలీసులకే గన్ ఎక్కుపెడితే ఊరుకుంటారా మరి? పాప్ సింగర్ అరెస్ట్..!
By: Tupaki Desk | 9 Jan 2021 7:55 AM GMTపంజాబీ పాప్ సింగర్ శ్రీ బ్రార్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ బ్రార్ ఇటీవల విడుదల చేసిన ఓ పాట తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఆ పాటలో అతడు పోలీసులకు గన్ ఎక్కుపెడుతూ కనిపించాడు. వివాదాస్పదం అయినప్పటికీ ఈ పాటకు యువతను బాగా ఆకర్షించింది. అనూహ్యరీతిలో వైరల్ అయ్యింది. వ్యూస్ లక్షల్లో ఏకంగా ఏకంగా కోటి దాటాయి. ఏకంగా కోటి నలబై లక్షల మంది ఈ పాటను చూశారు. మరోవైపు ఈ పాట పంజాబ్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా ఉందని సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సీఎం అమరీందర్ సింగ్ కు ఈ పాట కోపం తెచ్చిందట. దీంతో వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ పాట నెలక్రితం విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట గన్ కల్చర్ ను ప్రోత్సహించేలా ఉందని పోలీసులు అంటున్నారు. పంజాబ్ కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ శ్రీ బ్రార్ ఇటీవల ‘జాన్’ పేరుతో ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటలో పోలీసులకే గన్ ఎక్కుపెట్టాడు శ్రీబ్రార్. మరోవైపు ప్రభుత్వానికి - పోలీసులకు కూడా ఈ పాట సాహిత్యంలో వ్యతిరేకత ధ్వనించింది. మరోవైపు ఈ సాంగ్ విన్న యువత ఉర్రూతలూగిపోయారు. కేవలం స్వల్ప వ్యవధిలోనే దాదాపు కోటి నలబైలక్షల మందిని వీక్షించారు. అయితే ఈ పాట పంజాబ్ సీఎంకు కోపం తెప్పించింది. పోలీసులకు కూడా ఎక్కడో కాలింది. అందుకే సింగర్‌ను అరెస్ట్ చేసి లోపలేశారు.
ఈ వీడియలోలో శ్రీ బ్రార్ తోపాటు బార్బీ మాన్ అనే లేడీ ర్యాపర్ - గుర్నీత్ దొసాంజ్ అనే పాప్ ఆర్టిస్ట్ నటించారు. సాహిత్యం మాత్రం బ్రార్ దే. ఈ వీడియో సాంగ్ లో నటించిన గుర్నీత్ రెండు చేతుల్తో రెండు గన్స్ పట్టుకుని పోలీస్ స్టేషన్ లోకి వెళ్తాడు. స్టేషన్ లోని పోలీసుల్ని టపాటపామని లేపేసి - లాకప్ లాక్ లను పేల్చేసి తన నిందితులైన స్నేహితులను విడిపిస్తాడు. ఈ హీరోయిజాన్నంతా బార్బీ ఆరాధన భావంతో చూస్తూ ఉంటుంది.
వెనక బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ‘ ఓ జాట్ కుర్రాడా నీకు మీసాలొచ్చాయి. నీకు నువ్వే ఓ బ్రాండ్‌వి. నేరాన్ని శ్వాసించే వాళ్లంతా నీ వాళ్లే. అందుకే వాళ్లను విడిపించి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడున్న పోలీసులకు నువ్వేంటే చూపించు’ ఇటువంటి అర్థం వచ్చేలా ఈ పాట లిరిక్ సాగుతుంది. అయితే ఈ పాట గన్ కల్చర్ ను - మాఫియా డాన్ లను - గ్యాంగ్ లను ప్రేరేపించేలా ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. మాఫియా పేరుతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.
పోలీసులను కొట్టే సినిమాలను.. పోలీసులను రౌడీలుగా చిత్రీకరించే సినిమాలు కూడా వచ్చాయి. గ్యాంగ్ స్టర్లను ఉత్తములుగా కీర్తించే సినిమాలు వచ్చాయి అయినప్పటికీ ప్రస్తుతం ఓ పాటపై పోలీసులు ఫైర్ అవ్వడం ఆశ్చర్యంగా ఉంది. శ్రీ బ్రార్ 2016లో పాప్ సింగర్ అయ్యాడు. అతడో ఆర్ట్ స్టూడెంట్. కరన్ అవుజ్లా - దిల్ ప్రీత్ థిల్లాన్ తో కలిసి పాడిన పంజాబీ సాంగ్ ‘యార్ గ్రరీబాజ్’తో ఇతడొకడున్నాడని ఇండీపాప్ సీనియర్ ఆర్టిస్టుల దృష్టిలో పడ్డాడు. అయితే అతడిపై ఈ కేసు ఎక్కువ కాలం నిలువదని అతడు త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అంటున్నారు ఫ్యాన్స్.