Begin typing your search above and press return to search.
కీర్తి పూర్వీకుల ఇంటికి హబ్బీతో వస్తానన్న శ్రీయ
By: Tupaki Desk | 21 Nov 2022 5:33 AM GMTమహానటి కీర్తి సురేష్ ఏం చేసినా అది అభిమానులకు చాలా ప్రత్యేకం. తనదైన నటన అందంతో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. స్టార్ డమ్ గురించి పాకులాట కంటే ప్రయోగాత్మక కంటెంట్ తో నటిగా తనని తాను నిరూపించుకునేందుకు ఈ భామ సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. ఇటీవల నాయికా ప్రధాన పాత్రలతో కీర్తి చేస్తున్న ప్రయోగాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇక తన సహనటీమణులతో కీర్తి అనుబంధం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. కీర్తి వెరీ ఫ్రెండ్లీ. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరితోను ఎంతో సన్నిహితంగా మెలుగుతుంది. ఇంతకుముందు కళ్యాణి ప్రియదర్శిని మాతృమూర్తి లిజీ ఇచ్చిన ఓ పార్టీలో సీనియర్ నటీమణులతో కలిసి సందడి చేసిన కీర్తి ఇంతలోనే మరో సోషల్ మీడియా పోస్ట్ తో హాట్ టాపిక్ గా మారింది.
ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ''8వ శతాబ్దానికి చెందిన నా పూర్వీకుల ఇంటిని అలాగే ఆలయాన్ని సందర్శించడం ఒక నాస్టాల్జిక్ డే. ఇది కేవలం నిర్మాణ(ఆర్కిటెక్ట్) సౌందర్యాన్ని మాత్రమే కాకుండా సానుకూలతను ప్రశాంతతను ప్రసరింపజేస్తుంది!'' అని తెలిపింది. తిరుకురుంగుడిలోని ఒక ప్రఖ్యాత దేవాలయాన్ని తాను సందర్శించానని తెలిసింది. అంటే కీర్తి పూర్వీకులు నివశించినది తిరుకురుంగుడి పరిసరాల్లో అని చెప్పకనే చెప్పింది.
అయితే దీనికి వ్యాఖ్యల విభాగంలో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా శ్రీయ దీనికి రిప్లయ్ ఇచ్చింది. ''నన్ను - మా ఆయన ఆండ్రీని తీసుకెళ్లండి. అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను'' అంటూ శ్రీయ కోరింది. బహుశా అందరినీ తనతో కలుపుకుని పోయే స్వభావం ఉన్న కీర్తి తొందర్లోనే శ్రీయను తన హబ్బీని ఈ దేవాలయానికి తన పూర్వీకుల వారసుల ఇంటికి తీసుకెళుతుందేమో చూడాలి.
ఆసక్తికరంగా ఈ వీడియోలో దేవాలయానికి సేవలందించే ఒక గజేంద్రుడి వీడియోని కూడా కీర్తి షేర్ చేసింది. మావటి ఈ ఏనుగును అనుసరిస్తున్నారు. చూస్తుంటే బాహుబలి కోసం ట్రైనప్ చేసిన గజరాజు చిరక్కల్ కాళిదాసన్ నే ఈ ఏనుగు తలపిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే...జాతీయ అవార్డు నటిగా కీర్తి కొన్ని మంచి ప్రాజెక్ట్ లతో తన నటనా జీవితంలో గొప్ప దశను ఆస్వాధిస్తోంది. తమిళ క్రైమ్ డ్రామా సాని కాయిదం .. మలయాళ కోర్ట్‌రూమ్ డ్రామా వాషిలో అద్భుత నటనకు ప్రశాంసాపూర్వక సమీక్షలను అందుకుంది. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన మల్టీస్టారర్ పొలిటికల్ డ్రామా 'మామన్నన్'లో కీర్తి సురేష్ కనిపించనుంది. నాని నటిస్తున్న 'దసరా' చిత్రంలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.