Begin typing your search above and press return to search.

బస్తీలో కుర్రాడికి కాదు.. తల్లికు పరీక్ష

By:  Tupaki Desk   |   2 July 2015 11:15 PM IST
బస్తీలో కుర్రాడికి కాదు.. తల్లికు పరీక్ష
X
''బస్తీ''. ఈ పేరుతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.. అయితే ఇప్పుడు ఈ టైటిల్‌తో వస్తోంది జయసుధ కొడుకు శ్రేయాన్‌ కపూర్‌. ఇది తెలిసిన విషయమే. సరదాగా యాక్టింగ్‌లోకి వచ్చా అంటూ శ్రేయాన్‌ ఏదో కవర్‌ చేస్తున్నాడు కాని.. ఒక ప్రక్కన డెబ్యూ సినిమా ఏమవుతుందా అని ఎవ్వరికైనా చెమట్లు పట్టాల్సిందే. తొలి సినిమా కనుక హిట్టు కాకపోతే ఇక్కడ టాలీవుడ్‌లో ప్రూవ్‌ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. మొన్ననే వచ్చిన వారిలో నాగ శౌర్య ఫస్టు సినిమా హిట్టు కొట్టాడు కాబట్టే మనోడు హిట్టు.. లేకపోతే ఫట్టయిపోయేవాడు. ఇకపోతే ఈ బస్తీ విషయంలో అసలైన టెన్షన్‌ పడేది ఎవరో తెలుసా?

అబ్బే.. కుర్రాడు శ్రేయాన్‌కు ఎంత ఉత్కంఠ ఉన్నా లేకపోయినా.. అసలైన టెన్షన్‌ మాత్రం జయసుధ ముఖంలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తెలుగులో హీరోలో కొడుకులు, కూతుళ్ళు క్లిక్కవ్వడమే కాని, హీరోయిన్లు కొడుకులూ కూతుళ్ళు పెద్దగా క్లిక్కవ్వలేదు. తరుణ్‌ ఒక్కడే బీభత్సంగా మెరిసినా తరువాత డల్‌ అయిపోయాడు. సరైన సినిమాలు పడుంటే ఇంకా ఓ రవితేజలా సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు కాని, ఎందుకో అలా అలా ఫేడవుట్‌ అయిపోయాడు. అందుకే ఇప్పుడు శ్రేయాన్‌ అనుకున్నట్లు క్లిక్కవుతాడా అవ్వడా అని జయసుధ కళ్లలో పెట్రోమ్యాక్స్‌ లైట్లు వేసుకొని మరీ చూస్తున్నారట. ఆమె భర్త ప్రొడ్యూసర్‌, ఆవిడేమో సహజ నటి.. మరి కొడుకు తమ వారసత్వం పుచ్చుకొని ఎంతోకొంత సాధించకపోతే ఎలా అనేది ఆవిడ పాయింటు. చూద్దాం మరి కొత్త కుర్రాడు బస్తీతో మనకు ఏం చూపిస్తాడో...