Begin typing your search above and press return to search.

'ఎమ‌ర్జెన్సీ' కీల‌క పాత్ర‌లో శ్రేయ‌స్ త‌ల్ప‌డే!

By:  Tupaki Desk   |   28 July 2022 6:30 AM GMT
ఎమ‌ర్జెన్సీ కీల‌క పాత్ర‌లో శ్రేయ‌స్ త‌ల్ప‌డే!
X
బాలీవుడ్ న‌టి కంన‌గ ప్ర‌ధాన పాత్ర‌లో 'ఎమ‌ర్జెన్సీ' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భార‌త‌రాజ‌కీయ చరిత్ర‌లో ఓ ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన ఎమ‌ర్జెన్సీ రోజుల నాటి ఆస‌క్తిక‌ర క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. మాజీ ప్ర‌ధాని ఇందిర‌గాంధీ హ‌యాంలో దేశంలో త‌లెత్తిన ఎమ‌ర్జెన్సీ అంశాన్ని సినిమాలో హైలైట్ చేస్తున్నారు. ఇందులో ఇందిర పాత్ర‌లో కంగ‌న న‌టిస్తున్నారు.

ఈ సినిమాకు ఆమె స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్ లో ఇందిర‌గాంధీ ఆహార్యంలో కంగ‌న ఒదిగిపోయింది. ఇందిరాగాంధీకి అచ్చు గుద్దిన‌ట్లు గానే క‌నిపిస్తుంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే ఎమ‌ర్జెన్సీపై కంగ‌న బోలెడంత బ‌జ్ తీసుకొచ్చింది. ఇక టీజ‌ర్..ట్రైల‌ర్ తో అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరుకుంటాయ‌ని చెప్పొచ్చు.

అలాగే అప్ప‌టి ఇందిరాగాంధీ మంత్రివ‌ర్గంలో ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఎంతో మంది త‌ల‌పండిన దిగ్గ‌జాలు కీల‌క పాత్ర‌ పోషించారు. ఆ నాటి ప‌రిస్థితుల్ని ఎదుర్కునేందుకు తీసుకున్న నిర్ణ‌యాలు దేశ భ‌విష్య‌త్ నే నిర్ధేశించాయి. నాటి వాస్త‌వ పాత్ర‌ల‌న్నింటిని సినిమాలో హైలైట్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ పాత్ర‌లో అనుప‌మ్ ఖేర్ న‌టిస్త‌న్నారు.

తాజాగా మాజీ ప్ర‌ధాని..మంత్రి.. అట‌ల్ బిహారీ వాజ్ పేయి పాత్ర‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వాజ్ పాయ్ పాత్ర‌కి న‌టుడు..ద‌ర్శ‌కుడు శ్రేయ‌స్ త‌ల్ప‌డే పోషిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో త‌ల్ప‌డే కి ఈ పాత్ర ద‌క్క‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేసారు. భార‌త‌దేశంలోనే కాదు. ప్ర‌పంచంలోనే అత్యంత ప్రియ‌మైన నాయ‌కుల్లో వాజ్ పేయి ఒక‌రు.

అలాంటి గొప్ప వ్య‌క్తి పాత్ర‌ను పోషించ‌డాన్ని గౌర‌వంగా... పెద్ద బాధ్య‌త‌గా భావిస్తున్నా. టీమ్ నాపై పెట్ట‌కున్న న‌మ్మ‌కాన్ని..అంచ‌నాల్ని నిజం చేస్తున్నాను ఆశిస్తున్నాన‌ని'' తెలిపారు. శ్రేయాస్ త‌ల్ప‌డే చాలా బాలీవుడ్ సినిమాలు చేసారు. కొన్ని మ‌రాఠీ సినిమాలు సైతం చేసారు. నేచుర‌ల్ పెర్పార్మ‌న్ గా..ఎలాంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ స‌మ‌ర్ధుడిగా ఆయ‌న‌కి మంచి పేరుంది.

డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఎన్నో సినిమాల‌కు పనిచేసారు. సినిమాల‌కంటే ముందు టీవీ ఆర్టిస్ట్ గానూ గుర్తింపు ద‌క్కించ‌కున్నారు. ప్ర‌స్తుతం తల్ప‌డే వ‌య‌సు 46. వాజ్ పేయి ఆహార్యంలో ఒదిగిపోతారు? అన్న ధీమా వ్య‌క్తం అవుతుంది.

ఇక అనుప‌మ్ ఖేర్ పాత్ర సినిమాలో అంతే హైలైట్ గా ఉంటుందుని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడీ రెండు పాత్రల ఆహార్యం ఎలా ఉంటుంది? అన్న ఆస‌క్తి కంగ‌న అభిమానుల్లో మొద‌లైంది.