Begin typing your search above and press return to search.

శ్రియ సిటీకొస్తే ఇంతే..

By:  Tupaki Desk   |   26 Jan 2016 4:13 AM GMT
శ్రియ సిటీకొస్తే ఇంతే..
X
ఒక సారి టూర్ పెట్టుకుంటే నాలుగైదు పనులు కంప్లీట్ చేసేసుకోవాలి. అలా ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు తెలీకపోతే.. ఓ సారి శ్రియ టూర్ ప్రోగ్రామ్ పై ఓ కన్నేయండి. ఆమెలా ప్లాన్ చేసేసుకుంటే సరిపోతుంది. అర్ధం కాలేదా.. ఇప్పుడు శ్రియా శరణ్ హైద్రాబాద్ లో సందడి చేసేస్తోంది. సౌతిండియా మొత్తానికి ప్రెస్టీజియస్ ప్రోగ్రాం అయిన ఐఫా అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చింది శ్రియ.

ఇప్పటికే మొదటి రోజు వేడుకల్లో భాగమైంది కూడా. మోడ్రన్ గెటప్పులతో - కేట్ వాక్ లాంటి నడకతో మెప్పించేసింది. మొదటి రోజు ఈవెంట్ ని దిగ్విజయంగా జయప్రదం చేసింది. రెండో రోజు తెలుగు - కన్నడ సినిమాలకు అవార్డులు ఇవ్వనుండడంతో.. ఈమె షెడ్యూల్ రెండో రోజు అవార్డుల ఫంక్షన్ లోనూ కంటిన్యూ అవుతోంది. మరి ఫంక్షనేమో సాయంత్రం.. అప్పటివరకూ ఏం చేయాలి అనుకుందేమో.. ముందుగా చక్కగా ప్లాన్ చేసేసుకుంది. ఓ రెండు మూడు శారీ షాపులను ఓపెన్ చేసే ప్రోగ్రాంస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అక్కడేమో మోడ్రన్ గెటప్పులతో మెప్పించి. ఇక్కడేమో చీర సింగారంతో ఆకట్టుకుంటోంది.

మొత్తానికి గ్లామర్ ఫంక్షన్ లో అందాలు ఆరబోసేసి.. షాపింగ్ మాల్స్ లో శారీతో దర్శనమిస్తోంది శ్రియ. ఇలా అవార్డుల ఫంక్షన్ కోసం ఒకసారి సిటీకొచ్చి.. కమర్షియల్ యాంగిల్ లో నాలుగైదు పనులు కంప్లీట్ చేసేసుకోవడం చూసి.. ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఏమైనా శ్రియ ప్లానింగే ప్లానింగ్. కాకపోతే.. సినిమాల్లోనే వర్కవుట్ కాలేదు ఈ స్ట్రాటజీ.