Begin typing your search above and press return to search.

శ్రీయ అంటే శ్రీయ దట్సిట్‌

By:  Tupaki Desk   |   2 July 2015 7:59 AM GMT
శ్రీయ అంటే శ్రీయ దట్సిట్‌
X
దశాబ్ధం పైగానే టాలీవుడ్‌లో కెరీర్‌ సాగించిన కథానాయికల్లో శ్రీయశరణ్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్థావించాల్సిందే. ఇష్టం సినిమాతో కథానాయికగా పరిచయమై ఆ తర్వాత స్టార్‌ హీరోల సరసన అవకాశాలు అందుకుని స్టార్‌డమ్‌ పెంచుకుంది. నాగార్జున, చిరంజీవి, బాలయ్య, మహేష్‌, ఎన్టీఆర్‌ ఇలా స్టార్‌ హీరోలందరి సరసన నాయికగా నటించింది.

అయితే శ్రీయ ఇంత సుదీర్ఘ కాలం కెరీర్‌ని సాగించడం వెనక ఓ సీక్రెట్‌ ఉంది. తొలి చిత్రంలో నటించినప్పుడు శ్రీయ ఎలా ఉందో నిన్న మొన్నటి మనం, గోపాల గోపాల చిత్రాల్లోనూ అలానే కనిపించింది. అంటే అప్పటికి ఇప్పటికీ ఈ అమ్మడి రూపలావణ్యంలో ఎలాంటి మార్పు లేదు. అందుకే ఇప్పటికీ తెలుగు యువత అమ్మడి వెంటపడుతూనే ఉన్నారు. శ్రీయ ఎక్కడ ఉన్నా తనే స్పెషల్‌ ఎట్రాక్షన్‌. అదే స్మయిల్‌, హావభావాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే ఇప్పటికీ మన ఫిలింమేకర్స్‌ అవకాశాలిస్తున్నారు. ఇదిగో నిన్నటిరోజున 'సైమా' అవార్డుల ప్రచార వేదికపై ఇలా తళుక్కుమంది. శ్రీయ అంటే శ్రీయనే. దటీజ్‌ శ్రీయ అనిపించింది.

బ్యాక్‌ చూపించి బెండు తీసింది. పండోరా గ్రహం మీంచి కొన్ని ఐవా(వృక్ష జాతి దేవత)లు ఈ అమ్మడి డ్రెస్సులోకి వచ్చి చేరాయి. వంగపువ్వు రంగులో ఉన్న ఐవాలు వెరీ స్పెషల్‌గా కనిపిస్తున్నాయి కదూ? అదే పండోరా గ్రహంపైన ఉన్న పచ్చందాన్ని, ఎరుపందాన్ని, పసుపందాన్ని ఈ డ్రెస్‌లో ఇరికించి హైలైట్‌ చేశారు డిజైనర్‌. అవతార్‌ల గ్రహం నుంచి ఇలపైకి దిగొచ్చిన కన్యకలా ఉంది శ్రీయ.