Begin typing your search above and press return to search.

బలవంతంగా ముద్దు పెట్టించిన శ్రియ!!

By:  Tupaki Desk   |   30 Dec 2016 4:44 PM GMT
బలవంతంగా ముద్దు పెట్టించిన శ్రియ!!
X
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో లాంఛ్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ లో తెలుగువాడి గొప్పదనం గురించి దర్శకుడు క్రిష్ మాట్లాడిన మాటలు ఎంతో మందిని కదిలించేశాయి. ఈ ఫంక్షన్ సందర్భంగా తీసిన ఓ సూపర్బ్ ఫోటో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.

ఇందులో క్రిష్ మొహాన్ని గట్టిగా పట్టుకున్న శ్రియ.. ఓ అమ్మాయితో క్రిష్ కి బలవంతంగా ముద్దు పెట్టిస్తోంది. మన దర్శకుడు కొంచెం ఇబ్బందిగా ఫీలవుతున్నా ఫేస్ లో మాత్రం సంతోషం చూపిస్తున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు లెండి.. క్రిష్ భార్య రమ్య. శాతకర్ణి షూటింగ్ సమయంలోనే క్రిష్-రమ్యల వివాహం జరగగా.. పట్టుమని పది రోజులు కూడా గ్యాప్ తీసుకోకుండానే మళ్లీ షూటింగ్ కి వచ్చేశాడు క్రిష్. అంతే కాదు.. భార్యతో కలిసి చాలాభాగం శాతకర్ణి షూటింగ్ కంప్లీట్ చేశాడు క్రిష్.

ఆడియో రిలీజ్ సందర్భంగా కూడా.. అందరి ముందూ ఓపెన్ గా ఐలవ్యూ అని భార్య రమ్యకు చెప్పాడు క్రిష్. తాను చెప్పాలనుకునే మాటలను ఆవేశంగా చెప్పేటప్పుడు మినహాయిస్తే.. మిగతా సమయంలో సిగ్గుపడిపోయే క్రిష్ కి.. ఇలా భార్యతో బలవంతంగా ముద్దు పెట్టించి మరీ ఫోటో తీయించింది శ్రియ. అదీ ఈ బలవంతపు ముద్దు వెనక ఉన్న కథ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/