Begin typing your search above and press return to search.

వశిష్టీ దేవికి విషెస్ చెప్పిన శాతకర్ణి

By:  Tupaki Desk   |   11 Sept 2016 11:37 AM IST
వశిష్టీ దేవికి విషెస్ చెప్పిన శాతకర్ణి
X
టాలీవుడ్ కి సంబంధించినంత వరకూ ఈ జనరేషన్ లో ఎవర్ గ్రీన్ బ్యూటీ అనే మాట ఒక్క 'శ్రియా శరణ్'కి తప్ప వేరే ఎవరికీ సరిపోదు. గట్టిగా ఐదారేళ్లపాటు కెరీర్ ని కంటిన్యూ చేయడానికే హీరోయిన్లు నానా తంటాలు పడిపోతుంటే.. 17 ఏళ్లుగా లీడ్ హీరోయిన్ కంటిన్యూ అయిపోతోంది శ్రియ. అప్పటికి ఇప్పటికీ అమ్మడి ఫిజిక్ లో ఇసుమంత కూడా ఛేంజ్ రాకుండా మెయింటెయిన్ చెయ్యడం అసలు స్పెషాలిటీ. నార్త్ లో మినహాయిస్తే సౌత్ లో ఇంత కాలంపాటు ఈ రేంజ్ లో గ్లామర్ ని కంటిన్యూ చేసే హీరోయిన్లు కనిపించరు.

ఇవాల్టితో శ్రియకు 34 ఏళ్లు పూర్తి చేసుకుని 35లోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. గౌతమిపుత్ర శాతకర్ణి యూనిట్ బర్త్ డే విషెస్ చెబుతూ శ్రియ.. ఫస్ట్ లుక్ విడుదల చేసింది. బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో ఆయన భార్యగా నటిస్తోంది శ్రియ. ఈ సినిమాలో ఈమె పేరు వశిష్టి దేవి. గెటప్ తోనే రాణి లుక్ ని చూపించేసిన శ్రియకు.. ఆ నగలన్నీ అదనపు అలంకారాలు మాత్రమే అని చెప్పాలి. రాణి పాత్రకు దర్శకుడు ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడో.. అంతకు మించి ఆ పాత్రలో ఒదిగిపోయినట్లుగా కనిపిస్తోంది.

వెంకీతో గోపాలా గోపాల చేసిన తర్వాత తెలుగులో శ్రియకు ఇదే మెయిన్ స్ట్రీమ్ మూవీ. శాతకర్ణి తర్వాత తనకు మరిన్ని ఆఫర్స్ వస్తాయని.. బోలెడన్ని ఆశలు పెట్టుకుంది శ్రియ. మనల్ని మరింతకాలం శ్రియా శరణ్ అలరించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే టు శ్రియా.