Begin typing your search above and press return to search.

పెళ్లి కబుర్లపై శ్రియ చెప్పేసింది!!

By:  Tupaki Desk   |   7 Feb 2018 9:31 AM GMT
పెళ్లి కబుర్లపై శ్రియ చెప్పేసింది!!
X
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ బ్యూటీ శ్రియా శరణ్ పెళ్లి చేసుకుంటోందంటూ చాలానే వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం నుంచి ఓ రష్యన్ కుర్రాడితో ప్రేమలో ఉందని.. ఇప్పటికే వీరిద్దరూ పెళ్లికి ఫిక్స్ అయిపోయారని.. పెళ్లి ముహూర్తం కూడా కుదిరిపోయిందని.. రాజస్థాన్ లో పెళ్లి చేసుకుంటోందని.. ఇలా అనేక రకాల వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ వార్తలు అన్నిటిపై శ్రియ అసలు సంగతి చెప్పేసింది. మొత్తం ఈ పెళ్లి కబుర్లు అన్నీ వాస్తవమే. కాకపోతే ఒక్క విషయంలోనే మీడియా పొరపాటుగా అర్ధం చేసుకందని చెప్పింది. ఇంతకీ ఆ ఒక్క మిస్టేక్ ఏంటంటే.. పెళ్లికూతురు శ్రియ కాదట. రష్యాలో చక్కర్లు.. అక్కడ షాపింగ్ చేయడం.. రాజస్థాన్ లో పెళ్లి పనులు.. అన్నీ వాస్తవమే అంటోంది శ్రియ. అయితే.. ఇది తన అత్యంత సన్నిహితమైన ఓ స్నేహితురాలి పెళ్లి కావడంతోనే.. అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటోందట. రాజస్థాన్ లో ఆమె పెళ్లి చాలా గ్రాండ్ గా జరగబోతోందని అంటోంది ఈ భామ.

అంతే కాదు.. ఇదే సమయంలో శ్రియ ఫ్రెండ్ తో పాటు.. ఓ బంధువుల అమ్మాయి పెళ్లి కూడా ఉందట. అలా రెండు పెళ్లిళ్ల పనులను చక్కపెట్టేస్తోందట శ్రియా శరణ్. ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ నటించిన టాలీవుడ్ మూవీ గాయత్రి ఎల్లుండి థియేటర్లలోకి రానుంది. మరోవైపు కోలీవుడ్ లో నరగసూరన్ అనే చిత్రం ద్వారా.. హిందీలో ప్రకాష్ రాజ్ రూపొందిస్తున్న తడ్కా చిత్రం ద్వారా ఆడియన్స్ ను పలకరించనుంది శ్రియ.