Begin typing your search above and press return to search.
క్వారంటైన్ టైంలో శ్రియా సిల్లీ వీడియోస్..!
By: Tupaki Desk | 10 April 2020 9:10 AM GMTలాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఇంట్లోనే కూర్చున్న సెలెబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా కరోనా వైరస్ పై జనాల్లో అవగాహన కల్పించడమే కాకుండా.. అభిమానులకు వినోదాన్ని కూడా పంచుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే హీరో హీరోయిన్లు రకరకాల పోస్టులతో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. అలాగే ఫిట్ నెస్ వీడియోలను అప్ లోడ్ చేస్తూ ఆరోగ్య సూత్రాలను కూడా తెలియజేస్తున్నారు. కాలక్షేపం కోసం తమలో దాగివున్న టాలెంట్ ను బయటకి తీసే పనిలో పడ్డారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో బోర్ కొట్టకుండా ఎలా గడపొచ్చో నేర్పిస్తున్నారు. అసలు ఈ సమయంలో తాము ఇళ్లలో ఏం చేస్తున్నామో చూపిస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోల ద్వారా మంచి వినోదాన్ని అందిస్తున్నారు. కొంతమంది పిచ్చి పిచ్చి చేష్టల ద్వారా కొత్త కొత్త ఛాలెంజులను కూడా విసురుతున్నారు. దీనికి నేనేమి తక్కువ కాదంటూ మన సొట్టబుగ్గల శ్రీయా కూడా బయటకి వచ్చింది. ఈ క్రమంలో ఈ హాట్ బ్యూటీ తన భర్త అండ్రీ కొచ్చివ్ కిచెన్ లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న ఓ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసి 'బర్తన్ సాఫ్ కరో' చాలెంజ్ కు శ్రీకారం చుట్టింది.
రష్యాలో తన భర్త ఆండ్రీ కోస్చీవ్ తో కలిసి క్వారంటైన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ శ్రియా శరణ్ ఇప్పుడు లేటెస్టుగా మరో వెరైటీ పోస్ట్ తో ముందుకొచ్చింది. ఈ జంట డిఫరెంట్ సైన్ బోర్డులతో చేసిన ఒక సిల్లీ అండ్ రొమాంటిక్ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శ్రీయా 'సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండని' సైన్ బోర్డు చూపించగా తన హస్బెండ్ మాత్రం దీనికి ఫన్నీగా 'ఈమె నాన్ స్టాప్ గా మాట్లాడుతుంది' అనే సైన్ బోర్డు చూపించాడు. 'రోజంతా నాన్ స్టాప్ గా పనిచేస్తున్న వాళ్లకి థాంక్స్' అని శ్రీయా చెప్పగా.. 'నాతో రోజంతా పని చేయిస్తుంది' అని ఆండ్రీ చూపిస్తున్నాడు. రోజంతా పని చేయిస్తున్నదని - ఆమె నుండి రక్షించమని అతను అడుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఇద్దరి ఎంజాయిమెంట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. క్వారంటైన్ లో శ్రీయా తన భర్తతో అంత కష్టమైన పనులు ఏమి చేపిస్తున్నదో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది మాత్రం ఇప్పటికే అవకాశాలు లేక కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టే స్టేజిలో ఉన్న ఈ భామ ఇలాంటి సిల్లీ వీడియోస్ ద్వారా మళ్ళీ అట్రాక్ట్ చేయాలని చూస్తోంది అంటున్నారు. ఏదేమైనా ఈ కరోనా వైరస్ సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తూ - సెలెబ్రెటీలకు మాత్రం బాగా హెల్ప్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి