Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ర్యాంపు మీద దేవతలా..

By:  Tupaki Desk   |   18 March 2016 10:57 AM IST
ఫోటో స్టోరి: ర్యాంపు మీద దేవతలా..
X
శ్రియా శరణ్.. సినిమాల్లో స్లో అయింది కానీ.. అందంలో మాత్రం అమ్మడి రేంజే వేరుగా ఉంటుంది. బేసిక్ గా డ్యాన్సర్ కావడంతో.. ఎప్పుడూ పర్ఫెక్ట్ బాడీతో నిగనిగలాడిపోతుంది. సౌత్ లో ఏ మేజర్ సినిమా ఫంక్షన్ జరిగినా.. ఈ సీనియర్ హీరోయిన్ డ్యాన్స్ షో ఖచ్చితంగా ఉంటుందంటే.. శ్రియకి ఉన్న డిమాండ్ అర్ధమవుతుంది. ఇప్పుడీ భామ.. ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంది.

అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో.. ర్యాంప్ వాక్ ను స్టార్ట్ చేసింది శ్రియ. బ్లాక్ కలర్ డ్రెస్ లో తలపై కిరీటం పెట్టుకుని.. డిజైనర్ వేర్ ధరించి శ్రియ నడుచుకుంటూ వస్తుంటే అందరికీ మతులు పోయాయి. మరోవైపు అమ్మడు క్లీవేజ్ అందాలను ఓ రేంజ్ లో ఎగ్జిబిట్ చేయడంతో.. ఎంతమంది వాకింగ్ చేసినా.. అందరూ ఈమెకే స్టిక్ అయిపోయారు. డిజైనర్ డ్రస్ కే వన్నె తెచ్చేలా ఉందంటూ పొగడ్తలు కురిపించేశారు.

ఇలాంటి ప్రశంసలు కొత్త కాదు కానీ.. శ్రియకు ఈమధ్య టైం అంత బాలేదు. ఈ సొగసరి నటించిన చివరి రెండు చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. తెలుగులో గోపాలా గోపాలా - హిందీ దృశ్యం బాగానే ఆడినా.. శ్రియకు మాత్రం ఆఫర్లు రాలేదు. బాహుబలి2లో భల్లాలదేవుడి భార్యగా కనిపించబోతోందనే టాక్ రావడంతో.. ఇక శ్రియ బౌన్స్ బ్యాక్ అవుతుందని అనుకుంటే.. అలాంటి ఆఫర్ ఏమీ లేదని తేల్చేసింది. మరి ఈ అందానికి ఆఫర్లు ఎప్పటికి వస్తాయో?