Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రోమ్ యువరాణి

By:  Tupaki Desk   |   2 July 2017 5:36 AM GMT
ఫోటో స్టోరి: రోమ్ యువరాణి
X
సైమా(SIIMA) అవార్డులు అంతే అది ఒక తారలు తిరిగాడుతున్న నేల. అక్కడ అన్ని సౌత్ ఇండస్ట్రిలు నుండి నటీనటులు వస్తారు. ఎక్కడ ఏ అవార్డ్ షో లోనైనా అక్కడుకు వచ్చిన నటులు చాల టెన్షన్ పడతారు అనుకుంటాం. అది ఒక రకంగా వాస్తవమే. కానీ అందరిలో కొంతమంది మాత్రం చాల టెన్షన్ పడతారు. వాళ్ళకు అవార్డ్ వస్తుందో రాదో అనికాదు.. వాళ్ళు అక్కడకు ఎలా వెళ్ళాలి ఏమి వేసుకోవాలి అనే.

అందరూ ఒకలాగే వేస్తే అదో పెద్ద చికాకు అందుకని ఒకరు డిజైనర్ డ్రస్ వేసుకుంటే మరొకరు సారీ కట్టుకొని వస్తుంటారు. అలాగే అబుధబి లో జరిగిన సైమా అవార్డ్స్ కు శ్రియ కూడా వచ్చింది ఇలా.. రోమ్ సామ్రాజ్యం లో పుట్టిన యువ రాణిలా దర్శనం ఇచ్చింది. తన పరువాలును ఆరబోస్తూ భుజాలకు వేలాడే తెరలాంటి పైట కొంచం వగరు కొంచం సొగసు అన్నీ కలిపి ఉన్నవి నాలో అన్న మాదిరి ఇలా నడిచి వచ్చింది అమ్మడు. తన కంటి వెలుగుతో చెవిలో నక్షత్రపు రింగ్లు పెట్టుకొని పెదాలకు ఎర్రదనం అద్ది తన హాట్ లుక్కులతో తో కూల్ గా నడిచింది శ్రియ.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తో మళ్ళీ తెలుగులో హిట్ కొట్టిన శ్రియ ఇప్పుడు అదే బాలయ్య కొత్త సినిమా పైసా వసూల్ సినిమాలో మళ్ళీ తెలుగు అభిమానులును పలకరించనుంది. మరి ఇంతటి అందంతో అక్కడ ఏమి చేసిందో కానీ ఇప్పుడైతే ఇలా అదరకొడుతుంది. 'ఇష్టం' సినిమా తో తెలుగులోకి అడుగు పెట్టి తమిళ్ తెలుగు హింది లో సినిమాలు చేస్తూ హిట్లు లేక పోయాన హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి అంటే దానికి కారణం శ్రియ ఫిట్నెస్ ఆమె అనుభవం అనే అనుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/