Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: శ్రీయ బ‌బ్లీ హాటీ

By:  Tupaki Desk   |   16 Sep 2018 7:57 AM GMT
ఫోటో స్టోరీ: శ్రీయ బ‌బ్లీ హాటీ
X
36 వ‌య‌సులో ఈ మిస‌మిసలేంటో? చూస్తే షాక్ తింటారు! ఈ వ‌య‌సులో ఇంత రూప‌లావ‌ణ్యం ఎలా సాధ్యం? అంటూ ఆ మిర‌మిర‌ల‌కు షాక్ తిన‌డం ఖాయం. ఆ రేంజులో అందాల్ని మెయింటెయిన్ చేస్తుంది కాబ‌ట్టే శ్రీయ అంటే ఇప్ప‌టికీ కుర్ర‌కారులో క్రేజు ఉంది. ఈ అమ్మ‌డి నిరంత‌ర ఫోటోషూట్ల‌కు అంతే ఫాలోయింగ్ ఉంది.

ఇటీవ‌ల సైమా అవార్డుల వేడుక‌లో శ్రీయ క‌నిపించిన తీరు మ‌తి చెద‌ర‌గొట్టిందంటే అతిశ‌యోక్తి కాదు. స్ట‌న్నింగ్ లుక్‌ తో యువ‌త‌రం నాయిక‌ల‌తో పోటీప‌డింది. ర‌ష్య‌న్ బోయ్‌ ఫ్రెండ్‌ - టెన్నిస్ ఆట‌గాడు ఆండ్రూ కోశ్చీవ్‌ ని పెళ్లాడాక శ్రీయ‌లో అందం ఇంకా పెరిగింది. కాస్త బొద్దుత‌నం ఇంప్రూవ్ అయినా అదే ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఆ గ్లో ఈ అవార్డు వేడుక‌ల్లో ప్ర‌త్యేకంగా హైలైట్ అయ్యింది. లేటు వ‌య‌సు ఘాటు అందాలు మ‌తి చెడ‌గొట్టాయి పో!

సైమా వేదిక‌పై క‌నిపించిన ఈ అమ్మ‌డిని జ‌నం క‌న్నార్ప‌కుండా చూశారు. శ్రీయ‌ ప్ర‌త్యేకించి డ్రెస‌ప్ అయిన తీరు క‌ట్టిప‌డేసింది. లైట్ పింక్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్‌ లో త‌ళుక్కున మెరిసిన శ్రీయ సెంటరాఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యింది. ఈ డ్రెస్‌ ని డిజైన్ చేసిన ఫ్యాష‌న్ డిజైన‌ర్ ఎవ‌రో తెలుసా? శ్రీయ క్లోజ్ ఫ్రెండ్ .. ది గ్రేట్ జీవీకే మ‌న‌వ‌రాలు శ్రీయా భూపాల్. త‌న ఫ్రెండు కోసం ఎంత‌టి డెడికేష‌న్‌ తో డిజైన్ చేసిందో క‌దూ?