Begin typing your search above and press return to search.
బన్నీ - ఆర్యాలకు ఛాలెంజ్ విసిరిన శ్రియా
By: Tupaki Desk | 3 April 2020 7:50 AM GMTకరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. షూటింగులు లేక ఖాళీగా ఉండటంతో ఇంటికే పరిమితమైన సెలెబ్రెటీల రకరకాల ఫొటోలు - వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలక్షేపం కోసం తమలో దాగివున్న టాలెంట్ ను బయటకి తీసే పనిలో పడ్డారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తూ ఉంటే - మరికొందరు తమ రోజువారీ కార్యక్రమాలను వీడియోలను తమ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టైమ్ పాస్ చేస్తున్నారు. అలాగే కరోనా పై పోరాటానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ సొట్టబుగ్గల శ్రియ సరికొత్త ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టింది.
ఈ హాట్ బ్యూటీ తన భర్త అండ్రీ కొచ్చివ్ కిచెన్ లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న ఓ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ఈ 'బర్తన్ సాఫ్ కరో' చాలెంజ్‌ను విసిరింది. ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - తమిళ యంగ్ హీరో ఆర్యలతో పాటు పలువురిని నామినేట్ చేశారు. వారి అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసి పెట్టాలని ఈ సందర్భంగా శ్రియ ఛాలెంజ్ విసిరింది. శ్రియా శరన్ విసిరిన ఈ ఛాలెంజ్ పై బన్నీ - ఆర్య ఎలా స్పందిస్తారో చూడాలి. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తూ, వెండితెరపై తనకంటూ ప్రత్యేకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ విసిరిన ఈ 'బర్తన్ సాఫ్ కరో' ఛాలెంజ్ ఇప్పుడు ట్రెండ్ కాబోతోందో లేదో చూడాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి