Begin typing your search above and press return to search.

వెంకీ నుంచి అరువు తెచ్చుకుందేమో?

By:  Tupaki Desk   |   7 July 2015 7:22 AM GMT
వెంకీ నుంచి అరువు తెచ్చుకుందేమో?
X
నిన్ననే తానా, నాట్స్‌ ఉత్సవాలు ముగిశాయి. ఈ వేడుకల్లో వెంకీ ఎన్నారైలకు వివేకానందుని సూక్తులు కొన్ని చెప్పి మరీ వచ్చాడు. నీలోనే దేవుడున్నాడు. నిన్ను నువ్వు చూసుకో. మనిషి వేరు. దేవుడు వేరు కాదు.. అంటూ జ్ఞానం, తత్వం భోధించాడు. అంతేనా సంపాదించిన దానితో సంతృప్తి పడు. అత్యాశకు పోకు. నేటి గురించి ఆలోచించు. నిన్నటి గురించి, భవిష్యత్‌ గురించి ఆలోచించి చింతలు కొని తెచ్చుకోకు అంటూ అద్భుతంగా చెప్పాడు.

మరి ఇంతలోనే ఈ మాటలకు ఇన్‌స్పయిర్‌ అయ్యిందో ఏమో.. వెంకీ మాజీ నాయిక శ్రీయ శరణ్‌ ట్విట్టర్‌లో కొంగొత్తగా స్పందించింది. ఒక యోగి పుంగవునికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ సాంతం చదివేశాను. మీరు యోగులకు అభిమానులా? అయితే ఎందులా? ఎస్‌ లేదా నో ఏదో ఒకటి చెప్పండి. అలాఏ ఎందుకు అభిమానులో విడమర్చండి.. అంటూ సింగిల్‌ లైన్‌లో మల్టిపుల్‌ క్వశ్చన్స్‌ని రెయిజ్‌ చేసింది.

వెంకీ సరసన ఇటీవలే గోపాల గోపాల చిత్రంలో నటించింది ఈ భామ. ఆన్‌సెట్స్‌ వెంకీ ఏం పాఠాలు నేర్పించాడో ఏమో.. ఇదిగో ఇలా అనూహ్యమైన మార్పు. అయితే శ్రీయ తొలినుంచీ పుస్తకాల పురుగు. అలాగని అప్పట్లో ఆధ్యాత్మికం చదివిందో లేదో తెలీదు, కానీ ఇటీవలి కాలంలో రెగ్యులర్‌గా ఆ టైపు పుస్తకాల్నే చదువుతోంది.. అంటే వెంకీ ప్రభావమే అయ్యుంటుంది. కొంపదీసి యోగినిలా మారుతుందా ఏంటి..