Begin typing your search above and press return to search.
శ్రియ ఐటెంకి హైప్ లేదేంటి గురూ!!
By: Tupaki Desk | 9 July 2017 5:22 AM GMTఓ హీరోయిన్ ఐటెం సాంగ్ చేసిందంటే.. ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంటుంది. గతేడాది జనతా గ్యారేజ్ మూవీలో.. కాజల్ ఐటెం నెంబర్ అనగానే బోలెడంత ఆసక్తి కనిపించింది. కానీ నక్షత్రం మూవీ విషయంలో ఇలా జరగడం లేదు. సినిమా అంతా పూర్తయిపోయాక.. ప్రత్యేకంగా ఈ పాటను రికార్డ్ చేయించి మరీ.. 'టైం లేదు గురూ' అంటూ శ్రియా శరణ్ తో స్పెషల్ ఐటెం సాంగ్ చేయించాడు దర్శకుడు కృష్ణవంశీ.
కానీ ఈ ఐటెం నెంబర్ కు అస్సలు హైప్ క్రియేట్ కావడం లేదు. ఇప్పటికే ఒకటికి రెండు వీడియో సాంగ్ టీజర్లు ఇచ్చినా.. పెద్దగా ఇంట్రెస్ట్ సృష్టించలేకపోయింది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ అంటే.. భామలు వేసే సూపర్బ్ స్టెప్స్ కు క్రేజ్ ఏర్పడుతుంది. కానీ శ్రియ చేసిన టైం లేదు గురూ విషయంలో మాత్రం.. డ్యాన్స్ కంటే ఎక్కువగా లైటింగ్ హంగామానే కనిపిస్తోంది. బాలీవుడ్ లో మున్నీ బద్నా హుయీ.. చిక్నీ చమేలీ వంటి పాటల నుంచి స్పెషల్ సాంగ్స్ లో భామలు వేసిన స్టెప్స్ కారణంగానే ఎక్కువ క్రేజ్ ఆపాదించుకోగలిగాయి.
శ్రియ లాంటి సూపర్బ్ డ్యాన్సర్ ను తీసుకుని కూడా.. ఎప్పటిదో ట్రెండ్ అయిన లైటింగుల హంగామాతో పాట చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ప్రోమోల్లో ఎక్కడా శ్రియా తెగ డ్యాన్సులు చేసేసినట్లుగా కనిపించడం లేదు. ఆన్ లైన్ జనాలు ఎలాగూ పట్టించుకోవడం లేదు.. మరి ఈ ఐటెం సాంగ్ ఆన్ స్క్రీన్ పై ఎలా మెప్పించనుందో చూడాలి.