Begin typing your search above and press return to search.

శ్రియ పెళ్లికూతురు అవుతోందా?

By:  Tupaki Desk   |   6 Feb 2018 6:43 AM GMT
శ్రియ పెళ్లికూతురు అవుతోందా?
X
టాలీవుడ్ లో మాత్రమే కాదు.. సౌత్ లోను.. అటు నార్త్ లోను కూడా క్రేజ్ ఉన్న బ్యూటీ శ్రియా శరణ్. డెహ్రడూన్ కు చెందిన ఈ బ్యూటీ.. 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగడం మాత్రమే కాదు.. తన రేంజ్ ను కాపాడుకుంటూనే ఉంది. ఇప్పటికీ బోలెడన్ని ఛాన్సులు అందుకుంటున్న ఈ బ్యూటీ.. త్వరలో పెళ్లికి రెడీ అయిపోతోందనే టాక్ వినిపిస్తోంది.

ఈ అందాల సుందరి అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అయినా.. త్వరలోనే శ్రియ పెళ్లి మాత్రం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఈ భామ రష్యాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడిందట. పరిచయం అయిన కొన్ని వారాల వ్యవధిలోనే ప్రేమలో మునిగిపోవడం.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం కూడా జరిగిపోయాయట. అంతే కాదు.. రెండు కుటుంబాలకు చెందిన వారు మాట్లాడుకోవడం కూడా జరగగా.. త్వరలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి వేదిక కూడా ఖరారు అయిందని బాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది.

రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు శ్రియ ప్లాన్ చేసుకుంటున్నట్లు చెపుతున్నారు. ఇప్పటివరకూ తన పెళ్లిపై శ్రియ అధికారికంగా స్పందించలేదు. అయితే.. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో తనకు ఇంట్లో ప్రెజర్ పెరుగుతోందని శ్రియ చెప్పుకొచ్చింది. అప్పటికే ఈ పెళ్లి ఖరారు అయి ఉంటుందని.. అందుకే అప్పుడా కబురు చెప్పి ఉంటుందని టాక్.