Begin typing your search above and press return to search.

అభిమానుల గుండెలను 'కబ్జ' చేసేంత అందం

By:  Tupaki Desk   |   8 March 2022 11:50 AM GMT
అభిమానుల గుండెలను కబ్జ చేసేంత అందం
X
కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర.. మరో కన్నడ స్టార్‌ హీరో కిచ్చ సుదీప్‌ మరియు బాద్షా లు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం కబ్జ. ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉపేంద్ర సినిమా అంటేనే వైవిధ్యభరితంగా ఉంటుందనే టాక్ ఉంది.

అందుకే ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ముఖ్యంగా ఆయన అభిమానులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

కబ్జ సినిమా కేవలం కన్నడం లేదా తెలుగు ఇతర సౌత్‌ భాషల్లో కాకుండా యావత్‌ భారతం మొత్తం కూడా విడుదల అవ్వబోతుంది. ఈ విషయాన్ని సినిమా ప్రారంభించిన రోజు.. ప్రకటించిన రోజు తెలియజేశారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ మొదలు అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఉన్నారు.

ఈ సమయంలో సినిమా నుండి మధుమతి పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. సినిమా లో మధుమతి పాత్రను సీనియర్ స్టార్‌ హీరోయిన్ శ్రియ పోషిస్తోంది. ఈ అమ్మడు ఇప్పటికే షూటింగ్‌ ను పూర్తి చేసుకుందనే ప్రచారంను కన్నడ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. అధికారిక ప్రకటన చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి వస్తుందంటూ ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మధుమతి పాత్రలో శ్రియ ను చూస్తుంటే గుండెల్లో గుబులు మొదలు అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. శ్రియ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయ్యింది. అంతే కాకుండా ఆమె ఇటీవలే తల్లి గా కూడా మారింది. అయినా కూడా ఆమె అందంలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఇష్టం సినిమాలో కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

శ్రియ అభిమానులు ఆమెను ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఇంతకంటే అందంగా చూడాలని ఆశిస్తున్నారు. తెలుగు లో ఈమె నటించిన సినిమాలు ముందు ముందు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈమె ఆర్‌ ఆర్ ఆర్ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

అందుకు సంబంధించిన లుక్‌ లో కూడా ఆకట్టుకుంది. ఏ పాత్ర పోషించినా కూడా అబ్బుర పర్చే లుక్ తో పాటు అందంతో ఆకట్టుకునే శ్రియ ను ఈసారి మధుమతి పాత్ర లుక్‌ లో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.